నాగార్జున తప్ప ఎవరూ దొరకట్లేదు

నాగార్జున తప్ప ఎవరూ దొరకట్లేదు

డైరెక్టర్‌గా లారెన్స్‌ హిట్స్‌ అయితే ఇచ్చాడు కానీ అతని పైత్యపు సినిమాలపై ప్రేక్షకులకి ఓ విధమైన యావగింపు ఉంది. 'రెబల్‌' చిత్రంతో లారెన్స్‌ సృష్టించిన భయోత్పాతంతో అతనితో పని చేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదు.

గతంలో కూడా లారెన్స్‌కి హీరోలు ఎవరూ దొరకనప్పుడు నాగార్జునని ఆశ్రయించాడు. నాగార్జున అతడిని మాస్‌ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయడమే కాకుండా మళ్లీ డాన్‌కి కూడా దర్శకుడిగా పెట్టుకున్నాడు. ఆ రెండు చిత్రాలు నాగార్జునకి సత్ఫలితాలనే ఇచ్చాయి.

ఈమధ్య చాలా మంది హీరోల చుట్టూ తిరుగుతున్న లారెన్స్‌కి ఎవరి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం లేదు. దాంతో మరోసారి నాగార్జున దగ్గరికే వెళ్లాడు. త్వరలోనే ఈ కాంబినేషన్‌లో మూడో సినిమా రానుందని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం డాన్‌కి సీక్వెల్‌ అని కూడా ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English