అందుకే లుంగీ టు పంచె ప్రమోషన్

అందుకే లుంగీ టు పంచె ప్రమోషన్

డ్రెసింగ్ విషయంలో.. ఆన్ స్క్రీన్ పై కనిపించడం అంశంలో మహేష్ బాబుకి కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉంటాయి. వాటి నుంచి అంత త్వరగా బైటకు రాడు. వచ్చే ఉద్దేశ్యాలు కూడా కనిపించవు. లుక్స్ మార్చడం అంటే.. హెయిర్ స్టైల్ వరకూ ఛేంజ్ చేస్తుంటాడు. 1నేనొక్కడినే చిత్రం కోసం తప్ప.. మరెప్పుడూ అంతగా ఫిజిక్ ని ఛేంజ్ చేసుకోవడం కూడా అనే అంశాన్ని కూడా మహేష్ పట్టించుకోలేదు.

సూపర్ స్టార్ కెరీర్ బెస్ట్ మూవీ శ్రీమంతుడులో మాత్రం మహేష్ బాబు ఓ సన్నివేశంలో లుంగీతో కనిపిస్తాడు. అప్పట్లో ఆ పోస్టర్ సెన్సేషన్ అయింది. మూవీలో కూడా ఇది ఓ చిన్న సీన్ మాత్రమే అయినా.. లుంగీ లుక్ కి మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు ఉగాది సందర్భంగా భరత్ అనే నేను చిత్రంలోంచి ఓ స్టిల్ వదిలారు మేకర్స్. ముఖ్యమంత్రిగా పంచె కట్టుతో కనిపిస్తున్నాడు మహేష్. ఓ టెంపుల్ లో వెళుతున్న సీన్ అయుండచ్చు. శ్రీమంతుడులో ఓ విలేజ్ ను డెవలప్ చేయడం అనే కాన్సెప్ట్ కాబట్టి లుంగీ.. ఇక్కడ రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేసే ఐడియల్ సీఎం కదా.. అందుకే పంచెకు ప్రమోషన్ తీసుకున్నట్లుగా ఉన్నాడు.

ఈ రెండు సినిమాలు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందినవే అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటికే భరత్ అనే నేను మూవీని శ్రీమంతుడుతో కంపేర్ చేసుకుంటూ బోలెడన్ని పోలికలు పెట్టేస్తున్నారు.  ఇప్పుడు ఈ లుంగీ టు పంచె లుక్ కూడా వచ్చి చేరింది. అభిమానులు కూడా మళ్లీ శ్రీమంతుడు హ్యాంగోవర్ నే ఇష్టపడుతున్నారు. మధ్యలో వచ్చిన రెండు సూపర్ డిజాస్టర్స్ ను పక్కనపెట్టేసి.. శ్రీమంతుడు నాటి రోజులనే తలుచుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు