కాలా.. మైండ్ బ్లోయింగ్ అంతే

కాలా.. మైండ్ బ్లోయింగ్ అంతే

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టైల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో రజినీకాంత్. సరికొత్త లుక్స్ తో ఆరు పదుల వయసులోను అదే స్టామినాను మెయింటేన్ చేస్తోన్న తైలవా కు ఏనాడూ అభిమానుల సంఖ్య తగ్గలేదు. మూడు తారల అభిమానుల ప్రేమను ఆయన పెంచుకుంటూ వెళుతున్నారు. అసలు విషయానికి వస్తే.. రజినీకాంత్ నెక్స్ట్ కాలా సినిమా కోసం ప్రస్తుతం చాలా మంది ఎదురుచూస్తున్నారు.

పా.రంజిత్ తెరకెక్కించిన ఆ సినిమా ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా శాటిలైట్ హక్కుల గురించి తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. దాదాపు సినిమాకు పెట్టేసిన బడ్జెట్ నిర్మాత ధనుష్ అందుకున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు - తమిళ్ - హిందీ హక్కులను స్టార్ టీవీ రూ.75 కోట్లకు అందుకుంది. బాహుబలి - 2.0 సినిమాల అంత రేంజ్ లో సినిమా లేకపోయినా కూడా ఆ సినిమాల రేంజ్ లో శాటిలైట్ హక్కులను అందుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

పైగా రజినీకాంత్ - పా.రంజిత్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన కబాలి అనుకున్నంత స్థాయిలో హిట్టవ్వలేదు. అయినా కూడా కాలా కి ఆ సినిమా ఎఫెక్ట్ ఎంత మాత్రం పడలేదని అర్ధమవుతోంది. కాలా ట్రైలర్ కూడా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేదు గాని తప్పకుండా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఓ రేంజ్ లో రేటింగ్ వస్తుందని స్టార్ టీవీ నమ్మకంతో హక్కులను దక్కించుకుంది. మరి కాలా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు