సమంతకు ఇంతకంటే కాంప్లిమెంట్స్ ఏం కావాలి?

సమంతకు ఇంతకంటే కాంప్లిమెంట్స్ ఏం కావాలి?

ప్రస్తుత సౌత్ ఇండియన్ హీరోయిన్లలో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్నవాళ్లలో సమంత ముందు వరుసలో ఉంటుంది. కేవలం తన అందం, నటనతోనే కాక తన వ్యక్తిత్వంతోనూ కట్టిపడేస్తుంటుంది సమంత. అందుకే ఇండస్ట్రీ జనాలు సైతం ఆమెకు దాసోహం అంటుంటారు. హీరోలు, డైరెక్టర్లు తనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుకుంటారు.

కథానాయికల్ని రిపీట్ చేసే అలవాటే లేని త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి పెద్ద డైరెక్టర్ వరుసగా సమంతతో మూడు సినిమాలు చేయడం విశేషం. ఇప్పుడు మరో అగ్ర దర్శకుడు సుకుమార్ సైతం సమంతకు ఫిదా అయిపోయినట్లున్నాడు.

‘రంగస్థలం’ సినిమాలో సమంత పెర్ఫామెన్స్ చూసి ఆశ్చర్యపోయానని.. ఆమెతో ఎప్పుడూ సినిమాలు చేస్తూనే ఉండాలనిపిస్తోందని సుకుమార్ చెప్పడం విశేషం. ‘‘నాగచైతన్యను పెళ్లి చేసుకుని జీవితాంతం అతడితో ఉండబోతున్నట్లే.. నిన్ను జీవితాంతం డైరెక్ట్ చేస్తూనే ఉండే అవకాశం నాకివ్వు’’ అని సమంతను ఉద్దేశించి సుకుమార్ అనడం విశేషం.

సమంతకు 30 ఏళ్లొస్తే 30 ఏళ్ల క్యారెక్టర్.. 40 ఏళ్లొస్తే ఆ వయసు క్యారెక్టర్.. ఇలా లైఫ్ టైం వయసుకు తగ్గట్లుగా ఆమెతో తన సినిమాల్లో పాత్రలు చేయించాలని ఉందని సుకుమార్ అన్నాడు. సుక్కు లాంటి విలక్షణ దర్శకుడు ఇలా అన్నాడంటే సమంతకు ఇంతకంటే కాంప్లిమెంట్స్ ఏం కావాలి? మరోవైపు హీరో రామ్ చరణ్ సైతం సమంతకు స్పెషల్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

సమంతతో ఏ హీరో నటించినా.. ఆ హీరో అంతకుముందు సినిమాలతో పోలిస్తే భిన్నంగా నటిస్తాడని.. పవన్ కళ్యాణ్ సైతం ‘అత్తారింటికి దారేది’లో కొత్తగా కనిపించడానికి సమంత కారణమని.. ఇలా హీరోలకూ సమంత ఎనర్జీ ఇస్తుందని అనడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు