ఆ టాప్ న‌టిని ష‌ర్ట్ విప్ప‌మ‌న్నార‌ట‌

ఆ టాప్ న‌టిని ష‌ర్ట్ విప్ప‌మ‌న్నార‌ట‌

వెండితెర‌పై వెలిగిపోయే న‌టీమ‌ణుల‌కు.. తెర వెనుక చాలానే క‌ష్టాలు ఉంటాయ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. తెర‌పై వెలుగు వెల‌గాలంటే తెర వెనుక ఎంతోకొంత రాజీ త‌ప్ప‌దంటారు. ఇందులో నిజం ఎంత‌న్న విష‌యాన్ని ఈ మ‌ధ్య‌న వ‌ర‌కూ ఓపెన్ గా మాట్లాడింది లేదు. ఎప్పుడైతే మీటూ ఉద్య‌మం మొద‌లైందో.. సినిమా రంగంలో హీరోయిన్ల‌కు ఎదుర‌య్యే లైంగిక వేధింపుల విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌టం మొద‌ల‌య్యాయి.

చిన్న చిన్న న‌టీమ‌ణుల మొద‌లు టాప్ హీరోయిన్ల వ‌రకూ లైంగిక వేధింపుల‌కు బాధితులే అన్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ రోజున హాలీవుడ్ టాప్ న‌టిగా గుర్తింపు పొందిన జెన్నిఫ‌ర్ లోపెజ్ సైతం లైంగిక వేధింపుల‌కు గురైన చేదు నిజాన్ని ఆమె చెప్పుకొచ్చారు.

30 ఏళ్ల క్రితం తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌ల్లో జ‌రిగిన విష‌యాల్ని ఆమె వెల్ల‌డించారు. అంద‌రూ రియాక్ట్ అవుతున్న మీటూ ఉద్య‌మంలో ఆమె పెద‌వి విప్పారు. తాను ఆడిష‌న్ వెళ్లిన రోజున ఏం జ‌రిగిందో ఆమె చెప్పుకొచ్చారు. "నేను ఒక్క‌దాన్నే ఆడిష‌న్ కు వెళ్లా. అక్క‌డ ప్రొడ్యూస‌ర్ న‌న్ను ష‌ర్ట్ విప్ప‌మ‌న్నారు. హాఫ్ న్యూడ్ గా క‌నిపించ‌మ‌న్నారు. నేన‌ప్పుడు నో చెప్ప‌టానికి ఎంత‌లా భ‌య‌ప‌డ్డానో ఆలోచిస్తే ఇప్ప‌టికి భ‌య‌మేస్తుంది" అంటూ ఓపెన్ అయ్యారు 40+  జెన్నిఫ‌ర్ లోపేజ్‌.

మీటూ ఉద్య‌మం మొద‌ల‌య్యాక హాలీవుడ్‌.. బాలీవుడ్ ఇలా చాలా వుడ్ల‌కు చెందిన హీరోయిన్లు త‌మ‌కు ఎదురైన చేదు అనుభ‌వాల గురించి ఓపెన్ అయ్యారు. త‌మ‌ను వేధించిన ఎంతోమంది సినీ ప్ర‌ముఖుల పేర్ల‌ను వారు బ‌య‌ట‌పెట్టారు. నిజానికి.. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు వ‌చ్చిందంతా జ‌స్ట్ శాంపిలేన‌ని.. అస‌లు నిజాల్ని హీరోయిన్లు బ‌య‌ట‌పెడితే.. చాలామంది ప్ర‌ముఖుల జీవితాలు ఆరిపోతాయ‌న్న మాటబ‌లంగా  వినిపిస్తూ ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు