సిగరెట్ మానలేకపోతున్నాన్న సూపర్ స్టార్

సిగరెట్ మానలేకపోతున్నాన్న సూపర్ స్టార్

తెరమీద గుప్పు గుప్పున పొగ వదిలే హీరోల్లో కొందరు నిజ జీవితంలోనూ స్మోకర్స్ అయ్యుంటారు.  ఐతే సినీ హీరోల ప్రభావం యువతపై చాలా ప్రభావం ఉంటుంది కాబట్టి హీరోలు ఇలాంటి వాటికి దూరంగా ఉండటం అవసరం. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా ఒకప్పుడు ధూమపాన ప్రియుడే. పెట్టెలకు పెట్టెలు సిగరెట్లు కాల్చిన వాడే.

మహేష్ బాబుకు కూడా ఈ అలవాటు ఉండేదని అంటారు. ఐతే వాళ్లిద్దరూ పొగతాగే అలవాటును విడిచిపెట్టారు.ఐతే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాత్రం తాను ఇప్పటికీ ధూమపానాన్ని వదలలేక పోతున్నానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

తనకు పొగతాగే దురలవాటు ఎప్పట్నుంచో ఉందని.. దాన్ని మానేయాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నానని.. కానీ కుదరడం లేదని అమీర్ చెప్పాడు. సినిమా మొదలయ్యేటపుడు ‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే ప్రకటన చూసినపుడల్లా తనకు సిగ్గుగా అనిపిస్తుందని.. సిగరెట్ మానేయాలనుకుంటానని.. గత ఏడాది ఒక దశలో పట్టుబట్టి సిగరెట్ మానే ప్రయత్నం చేశానని.. కానీ ‘దంగల్’ సినిమా పెద్ద హిట్టయ్యాక మళ్లీ సిగరెట్ పట్టుకున్నానని అమీర్ చెప్పాడు.

సిగరెట్ తాగే తోటి హీరోలకు అది మంచిది కాదని చెబుతుంటానని.. కానీ తాను మాత్రం మానలేకపోతున్నానని.. త్వరలో ఈ అలవాటుకు చరమగీతం పాడాలని పట్టుదలతో ఉన్నానని.. ఏం జరుగుతుందో చూడాలని అమీర్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English