అల్లు అర్జున్‌ సైలెంట్‌ అయిపోయాడేంటి?

అల్లు అర్జున్‌ సైలెంట్‌ అయిపోయాడేంటి?

సమ్మర్‌ సినిమాలు అన్నిటితో పాటు సమానంగా సందడి చేస్తూ వచ్చిన 'నా పేరు సూర్య' ఈమధ్య ఎక్కువ సందడి చేయడం లేదు. ముఖ్యంగా రంగస్థలం, భరత్‌ అనే నేను టీజర్లు వచ్చిన తర్వాత బన్నీ సినిమా సందడి బాగా తగ్గిందనిపిస్తోంది. ఉగాదికి ఆ రెండు సినిమాలకి ప్రత్యేక పోస్టర్లు వదిలితే 'నా పేరు సూర్య' టీమ్‌ మాత్రం ఏ పోస్టర్‌ లేకుండా పండగ కానిచ్చేసింది.

సడన్‌గా ఈ టీమ్‌ ఇంత స్తబ్ధుగా అయిపోవడం ఫాన్స్‌ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. నా పేరు సూర్యలోంచి అల్లు అర్జున్‌ బ్యాడ్‌ యాస్‌ స్టిల్‌ అప్పుడెంతగా ట్రెండ్‌ అయిందో తెలిసిందే. ఉగాదికి కూడా మరో అదిరిపోయే స్టిల్‌ లేదా టీజర్‌ వదుల్తారని ఫాన్స్‌ ఆశించారు. కానీ ఎందుకో ఈ టీమ్‌ సైలెంట్‌గా వ్యవహరిస్తోంది.

రంగస్థలం మేనియాలో వున్న అభిమానులని ఇప్పుడిటు డైవర్ట్‌ చేయడం ఇష్టం లేకే ఈ చిత్రం ప్రమోషన్లు ఏప్రిల్‌ మొదటి వారం వరకు చేయవద్దని డిసైడ్‌ అయ్యారని, రంగస్థలం సందడి ముగిసిన తర్వాత సూర్య హంగామా స్టార్ట్‌ అవుతుందని ఒక టాక్‌ వినిపిస్తోంది. సడన్‌గా సైలెంట్‌ అవడం చూస్తే అది నిజమేనని అనిపిస్తోంది. ఏప్రిల్‌ మొదటి వారంలో మొదలు పెట్టినా ప్రమోషన్స్‌కి నెల రోజులు టైమ్‌ వుంటుంది కనుక ఇది మంచి ఐడియానే అని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు