వెంకీ మామతో నాగచైతన్య

వెంకీ మామతో నాగచైతన్య

వెంకటేష్‌తో నాగచైతన్య కాంబినేషన్‌ ఎప్పట్నుంచో డిస్కషన్‌లో వున్నదే కానీ మెటీరియలైజ్‌ కాలేదు. ఫైనల్‌గా ఈ కాంబినేషన్‌ తొందర్లోనే తెరమీదకి వస్తుందని విశ్వసనీయంగా తెలిసింది. దర్శకుడు బాబీ ఇటీవలే వెంకీ, నాగచైతన్య ఇద్దరినీ కలిసి విడి విడిగా కథ వినిపించాడట. ఇద్దరు హీరోల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందట.

ఈ చిత్రాన్ని ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయలేదు కానీ సురేష్‌బాబు నుంచి కూడా గో ఎహెడ్‌ వచ్చేసిందని, ప్రస్తుతం ఇద్దరు హీరోలకి వున్న కమిట్‌మెంట్స్‌ అయిన తర్వాత ఇది మొదలవుతుందని సమాచారం. కోన వెంకట్‌ రాసిన స్టోరీ లైన్‌కి 'జై లవకుశ' ఫేమ్‌ బాబీ మంచి కమర్షియల్‌ ట్రీట్‌మెంట్‌తో కూడిన స్క్రీన్‌ప్లే రాసాడట. వెంకటేష్‌, చైతన్య ఇద్దరూ కూడా సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేసేసారని సమాచారం.

దగ్గుబాటి, అక్కినేని హీరోలు కలిసి చేసే సినిమా అంటే క్రేజ్‌ బాగానే వుంటుంది. ఈ చిత్రానికి కోన వెంకట్‌ కూడా నిర్మాణ భాగస్వామి అని తెలిసింది. ప్రేమమ్‌ సినిమాలో సింగిల్‌ సీన్‌లో కలిసి కనిపించిన మేనమామ, మేనల్లుడు ఇక సినిమా అంతటా కలిసి కనిపిస్తే ఆ సందడి వేరేలా వుంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు