రెమ్యూనరేషన్‌ వద్దని అవి రాయించుకుంటోన్న రవితేజ

రెమ్యూనరేషన్‌ వద్దని అవి రాయించుకుంటోన్న రవితేజ

రవితేజ మార్కెట్‌ ఎంత, పారితోషికం ఎంత ఇవ్వాలనే దానిపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. పలు చిత్రాలని రవితేజ కాదనడానికి రెమ్యూనరేషన్‌ పరంగా వచ్చిన డిస్కషనే కారణమని తెలిసింది. రవితేజ సినిమాలకి థియేట్రికల్‌ రెవెన్యూ పాతిక కోట్లు మించి రావడం లేదు. అతనికే పది కోట్ల పారితోషికం ఇమ్మని అడిగితే ఎలాగంటూ నిర్మాతలు గోల చేస్తున్నారు.

అయితే రవితేజ దీనికి పర్మినెంట్‌ సొల్యూషన్‌ కనుక్కున్నట్టే వున్నాడు. ఇకపై తనకి పారితోషికం ఇవ్వవద్దని నిర్మాతలకి చెబుతున్నాడట. దానికి బదులుగా శాటిలైట్‌, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ ఇచ్చేయమని అడుగుతున్నాడట. రవితేజ చిత్రాలకి హిందీ డబ్బింగ్‌ రైట్సే ఎనిమిది కోట్లు పలుకుతున్నాయి. శాటిలైట్‌ హక్కులు కూడా అంటే మొత్తంగా పధ్నాలుగు, పదిహేను కోట్లు ఈజీగా పలుకుతాయి.

మరి రవితేజ కోరినట్టుగా ఈ పదిహేను కోట్లని వదులుకోవడానికి నిర్మాతలు సై అంటారా లేక అతను అడిగిన పది కోట్ల పారితోషికం ఇచ్చేస్తారా అనేది చూడాలి. రవితేజ మాత్రం అయితే పది కోట్లు హార్డ్‌ క్యాష్‌ లేదా ఆ రైట్స్‌ ఇమ్మని ఖచ్చితంగా చెబుతున్నాడట. ఎలా చూసినా మాస్‌ మహారాజాకి ఇది బంపర్‌ డీలేనండోయ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు