రామ్‌ చరణ్‌ అటుదిటు, ఇటుదటు!

రామ్‌ చరణ్‌ అటుదిటు, ఇటుదటు!

రామ్‌ చరణ్‌ గడ్డం తీసేసి బోయపాటి శ్రీను సినిమా కోసం సిద్ధమైపోయాడు. రంగస్థలం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తర్వాత సరాసరి బోయపాటి సినిమా సెట్స్‌కి వెళ్లిపోతాడు. ఒక వారం షూటింగ్‌ చేసిన తర్వాత రంగస్థలం ప్రమోషన్స్‌ కోసం మరో వారం రోజులు బ్రేక్‌ తీసుకుంటాడు. ఏప్రిల్‌ 5 నుంచి మళ్లీ బోయపాటి చిత్రం షూటింగ్‌ నిరాటంకంగా జరిగిపోతుంది.

అయితే మాస్‌ చిత్రాలకి పెట్టింది పేరయిన బోయపాటి సినిమా కోసం రామ్‌ చరణ్‌ గడ్డం, మీసం షేవ్‌ చేసేసుకుని సిద్ధం కావడం అభిమానులని కాస్త నిరాశపరుస్తోంది. రంగస్థలం చిత్రంలో కనిపించినట్టు గుబురు గడ్డం కాకపోయినా, గ్యాంగ్‌లీడర్‌లో చిరంజీవిలా మాసిన గడ్డంతో బోయపాటి మార్కు మాస్‌ మసాలా చిత్రం చేస్తాడని ఫాన్స్‌ ఊహించారు. కానీ విషయం ఏమిటంటే బోయపాటి సినిమా మాస్‌ చిత్రం కాదట. ఫ్యామిలీ, రొమాన్స్‌ ప్రధానంగా సాగే ఎంటర్‌టైనర్‌ అట. ఇది బోయపాటికి మేకోవర్‌లాంటి సినిమా అని చెబుతున్నారు.

అటు క్లాస్‌ డైరెక్టర్‌ అయిన సుకుమార్‌తో రంగస్థలంలాంటి ప్యూర్‌ మాస్‌ సినిమా చేసిన చరణ్‌, ఇప్పుడు మాస్‌ డైరెక్టర్‌తో క్లాస్‌ చిత్రం అటెంప్ట్‌ చేస్తున్నాడన్నమాట. మరి ఇలా రోల్‌ రివర్సల్‌తో చేస్తోన్న ప్రయోగంతో చరణ్‌కి ఈ దర్శకులు ఎలాంటి ఫలితాలని ఇస్తారనేది చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు