అలా `ఎంద చాట‌' డైలాగ్ పుట్టింది: అలీ

అలా `ఎంద చాట‌' డైలాగ్ పుట్టింది: అలీ

"పాటొచ్చి ప‌దేళ్ల‌యినా ప‌వ‌ర్ త‌గ్గ‌లేదు...." అంటూ ఓ సినిమాలో అలీ చెప్పిన డైలాగ్ బాగా పాపుల‌ర్. అదే విధంగా అలీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 40 ఏళ్లయినా కామెడీ టైమింగ్ త‌గ్గ‌లేదు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. త‌న‌దైన శైలిలో హావ‌భావ‌ల‌ను ప‌లికిస్తూ....ర‌క‌ర‌కాల భాష‌ల డైలాగుల‌ను మిక్స్ చేస్తూ.....నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అలీ అల‌రిస్తున్నారు. బాలనటుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అరంగేట్రం చేసిన మిమిక్రీ ఆర్టిస్ట్  అలీ.....40 ఏళ్లలో దాదాపు 1100 సినిమాల్లో న‌టించారు.

అమ్మ ప్రేమ...సినిమా...ఎప్ప‌టికీ బోర్ కొట్ట‌వ‌ని అంటున్న అలీ....తాజాగా ఓ తెలుగు దిన ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అనేక ఆస‌క్తిక‌ర విషయాలు వెల్ల‌డించారు. సినిమాపై ప్రేమ‌, నిర్మాతపై ఇష్టం, ప్రేక్షకులంటే అభిమానం....ఉండ‌డం వ‌ల్లే ప్రతి పాత్రా కొత్తగానే అనిపిస్తుంద‌న్నారు. 10 లక్షలు సంపాదిద్దామ‌ని ఇండస్ట్రీలో అడుగు పెట్టాన‌ని....తెలుగు ప్రేక్ష‌కులు.....100 కోట్ల విలువైన‌ అభిమానాన్నిచ్చార‌ని చెప్పారు.

'మగాడు' షూటింగ్ కోసం కేరళలోని ఎర్నాకుళం వెళ్లిన‌పుడు హోటల్ కు దారి మ‌ర‌చిపోయాన‌ని, ఆ హోట‌ల్ ద‌గ్గ‌ర్లోని మార్కెట్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల‌ని వ‌చ్చీ రాని మ‌ల‌యాళంలో ఆటో డ్రైవ‌ర్ కు చెప్పాన‌ని అలీ గుర్తు చేసుకున్నారు. ‘ఎన్న శాట మార్కెట్‌, అడ్రస్‌ అల్లిల్లో...’ అంటూ ఆ డ్రైవ‌ర్ మ‌ల‌యాళంలో ఎడాపెడా వాయించేశాడ‌ని....త‌న‌కేమీ అర్థం కాక‌పోయినా....`ఆ శాటే...` అని ఆటో ఎక్కేశాన‌ని చెప్పారు.

చివ‌ర‌కు ఎలాగోలా ఊరంతా తిప్పి హోట‌ల్ కు చేర్చాడని, ఆ ట్రిప్ లో మ‌ల‌యాళ యాస బాగా అలవాటైంద‌ని చెప్పారు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ షూటింగ్ లో త‌న పాత్ర‌కు డైలాగులు లేవ‌ని, తాను మలయాళంలో సొంత‌గా డైలాగ్ చెప్పాల‌ని రచ‌యిత అన్నార‌ని తెలిపారు. ఆ ర‌కంగా `ఎంద చాట` డైలాగ్ పాపుల‌ర్ అయింద‌ని, త‌న డైలాగ్ క‌న్నా బ్రహ్మానందం గారి రియాక్షన్ చూసి ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేశార‌ని అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు