ఇవాంకా గురించి పవన్, ఆలీ గొడవ!

ఇవాంకా గురించి పవన్, ఆలీ గొడవ!

ఇవాంకా గురించి పవన్ కళ్యాణ్, ఆలీ గొడవపడటం ఏంటి..? ఆశ్చర్యంగా అనిపిస్తోందా..? ఐతే ఈ మాట ఎవరో అన్నది కాదు.. స్వయంగా ఆలీనే అన్నాడు. ఈ మధ్య తనకు, పవన్ కళ్యాణ్‌కు ఏదో గొడవైందని ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆలీని ప్రశ్నిస్తే.. అతను తనదైన శైలిలో స్పందించాడు.

పవన్ తనకు ఆప్త మిత్రుడని.. తమ మధ్య గొడవైందని ప్రచారాలు జరుగుతున్నాయని చెబుతూ.. ‘‘అవును. మా ఇద్దరికీ గొడవైంది. అది అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా గురించే. ఆమె గురించి నేను, పవన్ కొట్టుకున్న మాట వాస్తవమే. ఇదే మాట రేపు పవన్‌ను కూడా అడగబోతున్నా’’ అని చమత్కరించాడు ఆలీ.

అయినా తమ మధ్య ఏం గొడవలుంటాయని.. మొన్న జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కూడా తాను వెళ్లానని.. ఆ సందర్భంగా తెలుగు ఖురాన్ తీసుకెళ్లి ప్రార్థనల్లో కూడా పాల్గొన్నానని ఆలీ గుర్తు చేశాడు. పవన్ హీరో కాకముందు నుంచే తనకు పరిచయమని.. ఒకసారి చిరంజీవి కోసం ఇంటికి వెళ్తే.. పవనే తనను రిసీవ్ చేసుకుని మాటలు కలిపాడని.. అలా తమ స్నేహం మొదలైందని.. పవన్ తొలి సినిమా.. చివరగా చేసిన ‘అజ్ఞాతవాసి’ మినహాయిస్తే తన ప్రతి సినిమాలోనూ తాను నటించానని ఆలీ తెలిపాడు.

మరి పవన్ ‘జనసేన’లో చేరతారా అనే ప్రశ్నకు మాత్రం ఆలీ సమాధానం చెప్పలేదు. తమ మధ్య ఇప్పటిదాకా ఆ ప్రస్తావన రాలేదని ఆలీ చెప్పాడు. తాను ఎన్నికల్లో పోటీ చేసే విషయంపైనా ఆలీ మాట దాటవేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు