మాస్ రాజా చేతిలో పవన్ మూవీ?

మాస్ రాజా చేతిలో పవన్ మూవీ?

పవన్ కళ్యాణ్ తో ఫుల్ స్పీడ్ లో ఓ సినిమా చేయాలన్నది మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచన. అందుకే అజ్ఞాతవాసి విడుదలకు ముందే అన్నీ రెడీగా పెట్టేసుకుని సిద్ధమైపోయారు. కానీ ఆ రిజల్ట్ ప్రభావం.. మరోవైపు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని.. మరో రెండేళ్ల వరకూ తాను సినిమా చేసే పరిస్థితి లేదని చెప్పేశాడు పవన్ కళ్యాణ్.

దీంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ తో చేయాలని భావించిన సినిమాను.. మాస్ హీరో గోపీచంద్ తో నటింపచేయాలని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయట. ఇప్పుడీ ప్రాజెక్టు రవితేజ చెంతకు చేరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్న మైత్రి సంస్థ.. సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్టును కూడా చేపట్టాల్సిందిగా కోరడం.. ఇందుకు రవితేజ కూడా ఓకే అనేయడం జరిగిపోయాయట. అలా పవన్ కళ్యాణ్ కోసం ప్రిపేర్ చేసి.. మాస్ హీరో గోపీచంద్ తో చేయాలని అనుకున్న సినిమా.. ఇప్పుడు మాస్ మహరాజా రవితేజ చెంతకు చేరినట్లు అయింది.

ఈ ప్రాజెక్టు అనుకున్న దగ్గర నుంచి ఏధో ఒక విధంగా వాయిదా పడుతూనే వస్తోంది. పవన్ నుంచి మారడం.. గోపీచంద్ చేతుల నుంచి జారడం.. ఇప్పుడు రవితేజ చేస్తానన్నా.. మాస్ మహరాజ్ కమిట్మెంట్స్ ను దృష్టిలో ఉంచుకుంటే.. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి చాలానే సమయం పట్టవచ్చునని టాక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు