ఈ హీరో బాలీవుడ్ నాని బాబోయ్‌

ఈ హీరో బాలీవుడ్ నాని బాబోయ్‌

తెలుగులో ఎలాంటి గాడ్‌ఫాద‌ర్ లేకుండా దూసుకెళ్తున్న హీరో నాని. ఏ స్థార్ హీరో కూడా ఏడాదికి మూడు సినిమాలు విడుద‌ల‌య్యేలా ప్లాన్ చేసుకోవ‌డం లేదు. కానీ నాని గ‌త మూడేళ్లుగా ఏడాదికి మూడు త‌గ్గ‌కుండా ప్లాన్ చేసుకుంటూ... స్టార్ హీరోల‌తో స‌మాన‌మైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఇలాంటి హీరోనే బాలీవుడ్ వ‌రుణ్ ధావ‌న్ కూడా. అత‌ను నానీ లాగే ప‌క్కా ప్లానింగ్ ప‌ర్స‌న్.

నానీ గ‌త మూడేళ్లు రికార్డు చూసుకుంటే... ప్ర‌తి ఏడాది మూడు సినిమాల లెక్క విడుద‌ల‌య్యాయి. భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ద‌గ్గ‌ర నుంచి జెంటిల్ మేన్, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ, మ‌జ్ను, నేను లోక‌ల్, నిన్నుకోరి మొన్న‌టి ఎంసీఏ వ‌ర‌కు అన్నీ హిట్లే. వ‌రుస‌గా అన్ని సినిమాలు హిట్ట‌వ‌డం నిజంగా రికార్డే. ఈ ఏడాది మ‌రో రెండు సినిమాలు సిద్ద‌మ‌వుతున్నాయి. మ‌రికొన్ని చ‌ర్చ‌ల్లో ఉన్నాయి. కృష్ణార్జున యుద్దం... నాగార్జున‌తో క‌లిసి చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ ఈ ఏడాదే విడుద‌ల కాబోతున్నాయి. ఇలా వ‌రుస పెట్టి సినిమాలను విడుద‌ల‌కు రెడీ చేస్తున్న హీరో తెలుగులో నానీయే. ఇలాంటి హీరోనే వ‌రున్ ధావ‌న్ కూడా.

వ‌రుణ్ కూడా గ‌త ప్ర‌తి ఏడాది రెండు మూడు సినిమాల‌ను విడుద‌ల‌య్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. మిగ‌తా హీరోలు ఏడాదికి ఒక్క సినిమాతోనే స‌రిపెట్టుకుంటుంటే వ‌రుణ్ ప‌క్కా ప్లానింగ్‌లో సినిమాల సంఖ్య పెంచుకుంటున్నాడు. 2015లో మూడు సినిమాలు 2017లో రెండు సినిమాలు విడుద‌ల‌య్యాయి. ఇక 2018లో మూడు సినిమాలు సిద్ద‌మ‌వుతున్నాయి. 2020వ‌ర‌కు వ‌రుణ్ క్యాలెండ‌ర్ ఫుల్ అయిపోయింది. మ‌రో రెండు సినిమాల‌కు ఓకే చెప్పాడు. ఇంత ప‌క్కా ప్లానింగ్ తో వెళుతున్నాడు క‌నుకే అత‌నికి సినిమాలు కూడా వ‌రుస క‌డుతున్నాయి. అనుష్క శ‌ర్మ‌తో కలిసి ప్ర‌స్తుతం సూయి ధాగా సినిమాలో న‌టిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English