విరుష్క్ ఇంటి అద్దె ఎంతో తెలుసా?

విరుష్క్ ఇంటి అద్దె ఎంతో తెలుసా?

అత‌డో ప్ర‌ముఖ క్రికెట‌ర్. ఆమె బాలీవుడ్ టాప్ టెన్ హీరోయిన్ల‌లో ఒక‌రు. మ‌రి.. ఇలాంటి ఇద్ద‌రు ప్ర‌ముఖులు పెళ్లి చేసుకొని ఒక అద్దె ఇంట్లో కాపురం చేయ‌టం అంటే మాట‌లా?  ఇంత‌కీ వారిద్ద‌రూ ఎవ‌రో మీకిప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది. అవును.. కోహ్లీ.. అనుష్క శ‌ర్మ‌లు. ముద్దుగా ఈ జంట‌ను విరుష్క్ అని పిలుచుకుంటుంటారు వారి అభిమానులు.
త‌మ సొంతింటికి రిపేర్లు చేయించుకుంటున్న నేప‌థ్యంలో ముంబ‌యిలోని ఒక ఇంట్లో అద్దెకు దిగారు.

అదేంది.. కోహ్లీ.. అనుష్క‌లకు సొంతిల్లు ఉంది క‌దా? అనొచ్చు. నిజ‌మే.. రూ.34 కోట్లకు 7 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని 2016లో కోహ్లీ కొనుగోలు చేశాడు. అయితే.. ఆ ఫ్లాట్ పూర్తి కాలేదు. అన్ని ప‌నులు పూర్తి అయి చేతికి రావ‌టానికి టైం ప‌ట్టేలా ఉంది. దీంతో.. ఇరువురికి న‌చ్చిన అద్దె ఇంట్లోకి ఈ మ‌ధ్య‌నే షిఫ్ట్ అయ్యారు.

విరుష్క్ లు అద్దెకు ఉండే ఇల్లు అంటే మాట‌లా?  ఎంతోకొంత విశేషం త‌ప్ప‌కుండా ఉండి ఉంటుంది. ఇంటి విశేషాల కంటే కూడా.. వారు చెల్లిస్తున్న నెల‌స‌రి అద్దె ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. అవాక్కు అయ్యేలా చేస్తోంది. అత్యాధునిక స‌దుపాయాలు ఉన్న ఒక అపార్ట్ మెంట్లోని 15వ అంత‌స్తులో 2675 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలోని ప్లాట్ ను అద్దెకు తీసుకున్నారు.

దాదాపు రెండేళ్లకు స‌రిప‌డా అద్దె అగ్రిమెంట్ చేసుకున్నాడు. విశేషం ఏమిటంటే.. ఈ ఇంటి అద్దెకింద ప్ర‌తి నెలా చెల్లించే మొత్తం ఎంతో తెలుసా?  అక్ష‌రాల రూ.15ల‌క్ష‌ల రూపాయిలు. రెండేళ్ల అద్దెలో భాగంగా ముంద‌స్తుగా రూ.1.50కోట్ల మొత్తాన్ని చెల్లించిన‌ట్లుగా చెబుతున్నారు. విరుష్క్ జంట స్థాయిలోనే వారి ఇంటి అద్దె ఉన్న‌ట్లు అనిపించ‌క మాన‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు