పూజ.. కాజల్‌ను కొట్టేస్తుందా ఏంటి?

పూజ.. కాజల్‌ను కొట్టేస్తుందా ఏంటి?

ఒకప్పుడు ఐటెం సాంగ్స్ కోసం ఐటెం భామల్ని, ద్వితీయ శ్రేణి హీరోయిన్లనే ఎంచుకునేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో కథ మారింది. స్టార్ హీరోయిన్లు సైతం ఐటెం పాటలకు ఓకే చెబుతున్నారు. బాలీవుడ్లో మొదలైన ఈ సంప్రదాయం తెలుగు సినిమాలకు కూడా విస్తరించింది.

అనుష్క, శ్రుతి హాసన్, తమన్నా, కాజల్ అగర్వాల్.. ఇలా స్టార్ హీరోయిన్లు ఒక్కొక్కరుగా ఐటెం సాంగ్స్‌లో ఆడి పాడారు. ఐతే వీళ్లందరిలో ఐటెం సాంగ్‌తో ఎక్కువ పాపులర్ అయింది.. జనాల్ని ఉర్రూతలూగించింది కాజల్ అగర్వాల్ అనే చెప్పాలి. ‘జనతా గ్యారేజ్’లో ఆమె పాట పక్కా లోకల్ ఒక ఊపు ఊపేసింది జనాల్ని.

స్టార్ హీరోయిన్లు చేసిన వాటిలో దీన్ని కొట్టే ఐటెం సాంగ్ మరొకటి లేదన్నది వాస్తవం. ఐతే ఇప్పుడు ‘రంగస్థలం’లో పూజా హెగ్డే చేస్తున్న జిగేల్ రాణి దీనికి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ పాట వినడానికి మరీ శ్రావ్యంగా ఏమీ లేదు కానీ.. ఇందులో డ్యాన్సులేసుకోవడానికి మంచి మ్యూజిక్కే ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. పాట కూడా చాలా సరదాగా రాశాడు చంద్రబోస్. ఈ పాటకు సంబంధించిన విజువల్స్ బాగున్నాయి.

పూజా హెగ్డే లుక్.. ఆమె డ్రెస్ అన్నీ బాగా కుదిరినట్లు అనిపిస్తోంది. స్వతహాగా రామ్ చరణ్ మంచి డ్యాన్సర్ కావడంతో ఈ పాట బాగానే క్లిక్కయ్యేలా కనిపిస్తోంది. ఇక చిత్రీకరణలో సుకుమార్ ముద్ర కూడా ఎలాగూ ఉంటుంది కాబట్టి.. ఈ పాట సినిమాలో హైలైట్ అయ్యే అవకాశముంది. మరి ‘పక్కా లోకల్’తో కాజల్ సృష్టించిన ప్రభంజనాన్ని ‘జిగేల్ రాణి’గా పూజ అధిగమిస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు