‘భరత్ అనే నేను’కు బంపర్ ఛాన్స్!

‘భరత్ అనే నేను’కు బంపర్ ఛాన్స్!

రజినీకాంత్ సినిమా అంటే తమిళనాటే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ బంపర్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాకు పోటీగా తెలుగు చిత్రాల్ని రిలీజ్ చేయడానికి కూడా వెనుకంజ వేస్తారు. సూపర్ స్టార్ కొత్త సినిమా ‘కాలా’ మీద ముందు అంతగా అంచనాల్లేవు కానీ.. దీని టీజర్ వచ్చాక సీన్ మారింది. దీని మీదా అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 27న ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు చేసుకోగా.. దానికి పోటీగా మరే సినిమానూ రిలీజ్ చేయట్లేదు.

ముందు వారం మహేష్ మూవీ ‘భరత్ అనే నేను’.. తర్వాతి వారం బన్నీ సినిమా ‘నా పేరు సూర్య’ షెడ్యూల్ అయి ఉన్నాయి. కాలాకు మంచి టాక్ వస్తే ఈ రెండు సినిమాలకూ ఇబ్బందే. ముఖ్యంగా మహేష్ మూవీ మీద ప్రభావం చాలా ఉంటుంది.

ఐతే కోలీవుడ్లో ప్రస్తుత పరిణామాలు చూస్తే ‘కాలా’ అనుకున్న ప్రకారం విడుదల కావడం కష్టమే అంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్లో సమ్మె నడుస్తున్న సంగతి తెలిసిందే. దీని విషయంలో నిర్మాతలు చాలా పట్టుదలతో ఉన్నారు. అంత సులువుగా ఇది తెగేలా కనిపించడం లేదు. కేవలం థియేటర్లు మూత పడటమే కాదు.. పరిశ్రమకు సంబంధించి అన్ని కార్యకలాపాలూ ఆగిపోయిన నేపథ్యంలో సమ్మె విరమించడంలో ఆలస్యమైతే ‘కాలా’ ఏప్రిల్ 27న విడుదల కావడం సందేహమే.

అదే జరిగితే ‘భరత్ అనే నేను’కు బాగా కలిసొస్తుంది. 27న పెద్ద తెలుగు సినిమాలేవీ రిలీజయ్యే అవకాశాలుండవు. రెండు వారాల పాటు ‘భరత్ అనే నేను’ దంచుకోవచ్చు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. ‘కాలా’ రాని పక్షంలో ‘నా పేరు సూర్య’కు కూడా కలిసొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు