బన్నీ వెనకబడిపోయాడే..

బన్నీ వెనకబడిపోయాడే..

వేసవికి రాబోయే సినిమాల్లో అన్నిటికంటే ముందు ప్రమోషన్లు మొదలుపెట్టిన సినిమా ‘నా పేరు సూర్య’నే. రిలీజ్ డేట్ ఖరారవ్వకముందే జనవరి 1నే ‘ఫస్ట్ ఇంపాక్ట్’ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి రెండు పాటలు రిలీజ్ చేశారు. పోస్టర్లు వదిలారు. ఇలా నెలా నెలన్నర పాటు ‘నా పేరు సూర్య’ హంగామా బాగానే సాగింది.

సినిమా వార్తల్లో నిలిచింది. కానీ ఆ తర్వాత ఎందుకో సడెన్‌గా హడావుడి ఆగిపోయింది. వేసవికి రాబోయే మిగతా సినిమాలన్నీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి. బాగా నెమ్మదిగా ఉన్న ‘భరత్ అనే నేను’ చిత్ర బృందం కూడా టీజర్ లాంచ్ చేసి ఈ చిత్రాన్ని హాట్ టాపిక్‌గా మార్చింది.

‘రంగస్థలం’.. ‘చల్ మోహన రంగ’.. ‘కృష్ణార్జున యుద్ధం’.. ఇలా వేసవికి రాబోయే మిగతా సినిమాలు బాగా వార్తల్లో నానుతున్నాయి. కానీ రెండు మూడు వారాలుగా ‘నా పేరు సూర్య’ గురించి డిస్కషనే లేదసలు. షూటింగ్ హడావుడిలో పడి ప్రమోషన్ల సంగతి వదిలేశారో ఏమో తెలియదు మరి. బన్నీ సినిమా అంటే విడుదలకు కొన్ని నెలల ముందు నుంచి ప్రచారం హోరెత్తిపోతుంది.

అతడి సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా బాగా ఆడటానికి విడుదల ముంగిట వచ్చే హైప్ కూడా ఒక కారణమే. మరి ‘నా పేరు సూర్య’ విషయంలో ఉద్దేశపూర్వకంగానే కొంచెం తగ్గి.. విడుదలకు ముందు నెలలో హంగామా మొదలుపెడదామని భావించారో ఏమో తెలియదు కానీ.. ఇప్పుడైతే ఈ చిత్రం గురించి చప్పుడే లేదసలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English