డేంజర్ జోన్లో మంచు విష్ణు

డేంజర్ జోన్లో మంచు విష్ణు


ఎప్పుడో జనవరి 26నే రావాల్సిన సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’. విడుదలకు అన్ని ఏర్పాట్లూ చేసుకుని థియేటర్లు కూడా బుక్ చేసుకుని అంతా సిద్ధమైన తర్వాత మూడు రోజు ముందు సినిమా రిలీజ్ కావట్లేదన్న ప్రకటన వచ్చింది. వాయిదా అంటే వారమో రెండు వారాలో అనుకున్నారు కానీ.. వేసవికి పోస్ట్ పోన్ అయిపోయిందీ చిత్రం.

వేసవిలో అసలెక్కడ ఖాళీ ఉంది ఈ సినిమాను రిలీజ్ చేయడానికి అనుకుంటుంటే.. ఒక మీడియం రేంజి సినిమాకు పోటీగా వెళ్లడానికే నిర్ణయించారు. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని డిసైడయ్యారు. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు.

ఐతే దీనికి పోటీగా వచ్చే నితిన్ సినిమా ‘చల్ మోహన రంగ’ మీద యూత్‌లో మంచి క్రేజే ఉంది. పైగా ముందు వారం ‘రంగస్థలం’ లాంటి భారీ సినిమా థియేటర్లలోకి దిగుతోంది. తర్వాతి వారం నాని సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ కూడా భారీ అంచనాలతోనే రాబోతోంది.  ఇంత పోటీ మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి. దశాబ్ద విరామం తర్వాత మళ్లీ ప్రొడక్షన్లోకి దిగి.. విష్ణు మార్కెట్ స్థాయికి మించి ఖర్చు చేసి.. రిలీజ్ లేటవడం వల్ల అదనపు భారం పెంచుకుని.. సినిమాపై ఎన్నో ఆశలతో ఉన్న నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు