ఈ హీరోలు అసలీ కాలం మనుషులేనా?

ఈ హీరోలు అసలీ కాలం మనుషులేనా?

ఇవాల్టి రోజుల్లో సెల్ ఫోన్ ప్రతీ ఒక్కరికీ నిత్యావసరం అయిపోయింది. తమ చేతిలో ఫోన్ లేకపోతే ప్రాణం పోయినట్లుగా ఉంటుందని చెప్పే జనాలు కొందరు అయితే.. అనేక మంది అలాగే ఫీలయినా పైకి చెప్పరు అంతే. సామాన్యులే కాదు.. ఇలాంటి కోవలో సెలబ్రిటీలు కూడా చాలామంది ఉంటారు. అయితే.. కొంతమంది టాలీవుడ్ తారలకు అసలు సెల్ ఫోన్ అంటేనే పట్టింపు లేదు. కొందరికి అసలు మొబైల్ ఫోనే లేకపోగా.. మరికొందరు ఉన్నా అసలు దాన్ని పట్టించుకోరు.

యంగ్ హీరో నాగశౌర్యకు సెల్ ఫోన్ లేనే లేదనే విషయాన్ని మరో కుర్ర హీరో నిఖిల్ బైట పెట్టేశాడు. ఇతన్ని కలవాలంటే ఎవరైనా ఇంటికి రావాల్సిందే. షూటింగ్ లో ఉన్నపుడు అయితే.. ఇతని డ్రైవర్ కు కాల్ చేస్తుంటారు పేరెంట్స్. ఇతని సోషల్ మీడియా అకౌంట్స్ ను కూడా ఓ ప్రైవేట్ పార్టీ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. దర్శకుడు శేఖర్ కమ్ములకు కూడా మొబైల్ ఫోన్ ఉపయోగించే అలవాటు ఏ మాత్రం లేదు. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా మొబైల్ ను అసలు ఖాతరు చేయరు. ఈయనకు సెల్ ఫోన్ ఉన్నా.. దాన్ని ఆయన పీఏ అటెండ్ చేస్తూ ఉంటాడంతే.

ఇక ఇదే కోవకు చెందుతాడు మహేష్ బాబు కూడా. మహేష్ కి కూడా సెల్ ఫోన్ ఉంటుంది. కాని దాన్ని కేవలం ట్విట్టర్ అప్ డేట్స్ పెట్టేందుకు తప్ప మరే అంశానికీ ఉపయోగించడం సూపర్ స్టార్. తనకు ఫోన్ ఉన్నా.. తనతో మాట్లాడాలంటే తన మేకప్ మ్యాన్ కో.. మరో వ్యక్తికో నమ్రత ఫోన్ చేస్తుందంటూ నవ్వుతున్నాడు మహేష్ బాబు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు