కళ్యాణ్ రామ్ ఆ డైలాగ్ పేల్చాడేంటబ్బా..

కళ్యాణ్ రామ్ ఆ డైలాగ్ పేల్చాడేంటబ్బా..

సినిమాల్లో హీరోలు పొలిటికల్ డైలాగులు పేల్చితే అవి హాట్ టాపిక్ అయిపోతాయి. ఆ డైలాగుల్ని హీరో నిజ జీవితానికి.. సమకాలీన రాజకీయాలకు రిలేట్ చేసి చర్చలు మొదలుపెట్టేస్తారు జనాలు. అందులోనూ పొలిటికల్ టచ్ ఉన్న ఫ్యామిలీలకు చెందిన హీరోలు ఇలాంటి డైలాగులు పేల్చితే ఇక చెప్పేదేముంది..? నందమూరి హీరోల్లో ఎవరు పొలిటికల్ డైలాగ్ కొట్టినా అది హాట్ టాపిక్కే. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ అదే పని చేశాడు. నిన్న లాంచ్ అయిన కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘ఎమ్మెల్యే’లో ఒక డైలాగ్ ఇలాగే చర్చనీయాంశంగా మారింది.

‘‘నేనింకా రాజకీయం చేయడం మొదలుపెట్టలేదు. మొదలుపెడితే మీరు చెయ్యడానికి ఏం మిగలదు’’.. అంటూ ఈ ట్రైల్లో ఒక డైలాగ్ ఉంది. దాని మీదే ఇప్పుడు డిస్కషన్లు నడుస్తున్నాయి. కళ్యాణ్ రామ్ బాబాయి బాలకృష్ణ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తండ్రి హరికృష్ణ ఒకప్పుడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి.. ఇప్పుడు సైలెంటుగా ఉన్నారు.
హరికృష్ణ విషయంలో తెలుగు దేశం పార్టీ అన్యాయం చేసిందన్న భావన ఆయన కొడుకులిద్దరిలో ఉన్నట్లుగా చెబుతారు. హీరోగా తిరుగులేని ఇమేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో కచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి కీలక పాత్ర పోషించగలడన్న అంచనాలున్నాయి. ఐతే కళ్యాణ్ రామ్ గురించి ఎప్పుడూ పెద్దగా చర్చ జరిగింది లేదు. ఐతే రాజకీయాల నేపథ్యంలో ‘ఎమ్మెల్యే’ సినిమా చేస్తూ.. పైన చెప్పిన పొలిటికల్ డైలాగ్ పేల్చేసరికి అందరి దృష్టి అతడిపై పడింది.

భవిష్యత్తులో తాను కూడా రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతాల్ని కళ్యాణ్ రామ్ ఇచ్చాడా అని జనాలు చర్చించుకుంటున్నారు. ఐతే మరీ ఆ స్థాయిలో డైలాగ్ పేల్చేంత రేంజ్ అయితే కళ్యాణ్ రామ్‌కు లేదన్నది వాస్తవం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు