పేర్లు చెప్పకపోతే ఎలాగమ్మా??

పేర్లు చెప్పకపోతే ఎలాగమ్మా??

''ఒక స్టార్ హీరో నన్ను వాడుకుని.. నాకు అవకాశాలు ఇవ్వలేదు'' అంటూ కామెంట్ చేసింది హీరోయిన్ శ్రీలేఖ ఎలియాస్ శ్రీ రెడ్డి. అంతకంటే ముందు ఒక ప్రొడ్యూసర్ తనతో చాలా దారుణంగా ప్రవర్తించాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది హీరోయిన్ అర్చన ఎలియాస్ వేద. ఒక సూపర్ స్టార్ ను చెప్పుతోటి కొట్టాను అంటుంది రాధికా ఆప్టే. నన్ను సినిమాలో నుండి అర్ధంతరంగా హీరో వలనే తీసేశారు అనేసింది తాప్సీ. తెలుగు ఫిలిం ఇండస్ర్టీ గురించి డైరక్టుగానో ఇన్ డైరక్టుగానో చాలామంది అమ్మళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే వీటితో ఒక ప్రాబ్లమ్ ఉంది.

ఇప్పటివరకు శ్రీరెడ్డి చాలామంది హీరోలతో ఫోటోలు దిగింది. పనిచేసింది. ఇక అర్చన కూడా చాలామంది నిర్మాతలతో సినిమా చేసింది. అలాగే రాధికా ఆప్టే కూడా నలుగురు స్టార్లతో పని చేసింది. అలాంటప్పుడు వీరు పేర్లు చెప్పకుండా ఇలా జరిగింది అలా జరిగింది అంటూ హైపోథెటికల్ కామెంట్లు చేస్తే.. ఖచ్చితంగా అందరూ అనుమానించబడతారు. ఏ హీరోను మోసం చేశాడబ్బా అంటూ అందరూ అందరినీ అనుమానిస్తున్నారు. ప్రముఖ స్టార్ హీరోల్లో మంచి వారు ఉండొచ్చు చెడ్డవారు ఉండొచ్చు.. కాని మంచి వారిని కూడా ఇప్పుడు మంచోళ్ళు అనలేని పరిస్థితి ఇటువంటి వ్యాఖ్యల వలన ఏర్పడుతోంది. అయితే దీనిపై ఈ భామలు ఏం చెబుతున్నారంటే.. అలా ఒక హీరో పేరు బయటపడితే మాకు ఇండస్ర్టీలో వేరే వారు ఛాన్సులు ఇవ్వరు దగ్గరకు రానివ్వరు అంటున్నారు. ఎందుకు ఇవ్వరో?

అలాంటప్పుడు అసలు ఇలా పేర్లు లేని రూమర్లు చెప్పడం ఎందుకు? దాని వలన ప్రయోజనం ఏముంటుంది? హార్వే వీనిస్టీన్.. చక్కగా ఆ పేరు చెప్పేశారు చాలామంది హాలీవుడ్ భామలు. ఇప్పుడు అతని కెరియర్ డిజాష్టర్ అయిపోయింది కాని.. కంప్లయింట్ ఇచ్చిన భామలకు ఏం కాలేదు. మరి ఇక్కడ కూడా పేర్లు ఓపెన్ చేయొచ్చుగా? అనవసరంగా అందరిమీదనా అనుమానాలే రేకెత్తించే బదులు!! థింక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు