అందాల రాక్షసికి అదిరిపోయే ఆఫర్

అందాల రాక్షసికి అదిరిపోయే ఆఫర్

హీరోయిన్ అంటే సినిమాలు వరుసపెట్టి చేస్తూ ఉండాలి. హిట్, ప్లాపులు పక్కన పెడితే చేతిలో ఆఫర్లు ఉంటే చాలు హీరోయిన్లు హ్యాపీ అయిపోతారు. కానీ కొన్నిసార్లు ఆఫర్ చేయి జారిపోయినా అది మన మంచికే అని కొందరు నమ్ముతారు. అది మన అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి విషయంలో ఇదే నిజమయ్యింది.

టచ్ చేసి చూడు లో ముందు హీరోయినుగా లావణ్యనే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఆ ఆఫర్ పోయినందువల్లే ఇప్పుడు లావణ్యకు మరో ఆఫర్ దక్కింది. అదెలా అంటారా? కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ఇప్పుడు రవితేజతో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఇప్పటిదాకా మాస్ మహారాజతో నటించని హీరోయిన్ మాత్రమే కావాలి అని వెతికితే లావణ్య కనిపించింది. అసలే చేతిలో సినిమాలు లేవు. ఏ సినిమా చేస్తున్నా అవి ప్లాపులు అయిపోతున్నాయి. మొన్న వచ్చిన ఇంటలిజెంట్ సినిమాతో తన దశ తిరిగిపోతోంది బోలెడు కలలు కంది కానీ సినిమా డిజాష్టర్ అవ్వడంతో ఒక్కటి కూడా నిజం కాలేదు. మొత్తనికి సంతోష్ శ్రీనివాస్ వల్ల ఒక్క ఆఫర్ దొరికిందన్నమాట. అందుకే ఇది అదిరిపోయే ఆఫర్ అని చెప్పింది.

కందిరీగ హిట్ అయినప్పటికీ వెంటనే రభస, హైపర్ అని రెండు ప్లాపులు పడడంతో కెరీర్ లో బాగా డౌన్ అయిన సంతోష్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ పవర్ స్టార్ సినిమాలకు గుడ్బై చెప్పేయడంతో మాస్ మహారాజ మీద దృష్టి పెట్టాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కళ్యాణ్ కృష్ణ సినిమా ఒక కొలిక్కి వచ్చిన వెంటనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు