సన్నీ ఇచ్చే సక్కని లిప్ లాక్ అతనికే

సన్నీ ఇచ్చే సక్కని లిప్ లాక్ అతనికే

బాలీవుడ్ భామగా అవతారం ఎత్తిన పోర్న్ బ్యూటీ సన్నీ లియోన్. ప్రస్తుతం హిందీ సినిమాలతో పాటు అడపాదడపా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వచ్చినపుడు మెరుస్తూ ఉంటుంది. ఇండియన్ మూవీ స్క్రీన్ పై అందాలతో పాటు.. ఆఫ్ స్క్రీన్ లో తెగువ చూపిస్తున్న ఈ భామ.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది.

అందాలను కుమ్మరించే ఫోటోలతో పాటు.. కుటుంబ విశేషాలను షేర్ చేసుకోవడానికి కూడా సన్ని లియోన్ తెగ ఉత్సాహంగా ఉంటుంది. ఈ బ్యూటీ ఇప్పుడు ఓ చూడచక్కని ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఓ వ్యక్తికి చక్కగా ఎంతో ఆప్యాయంగా మూతి ముద్దు అందించేస్తూ ఉంటుంది. ఇంత అంత అందంగా పొందికగా తన అధరాలను అందుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఆమె భర్త డానియెల్ వెబర్. షూటింగుల కోసం ఇలా ముద్దులు పెట్టుకోవడం సహజమే కానీ.. ఇంత పబ్లిక్ గా మొగుడితో రొమాన్స్ చేయడమేంటా అనిపించక మానదు.

ఈ అద్భుతమైన క్షణం.. వారి పెళ్లి రోజు సందర్భంగా చోటు చేసుకుంది. ఇవాల్టితో సన్నీ- డానియెల్ పెళ్లి జరిగి 10 సంవత్సరాలు పూర్తయింది. అయినా సరే.. ఇప్పటికీ కొత్త పెళ్లి జంట రేంజ్ లో వీరిద్దరూ ఎంజాయ్ చేస్తుండడం తెగ ప్రశంసించాల్సిన విషయం. పెళ్లి జరిగి పది సంవత్సరాలు పూర్తయినా.. ఇంకా ముద్దులు పెట్టుకునేందుకు సమయం దొరికింది అనే అర్ధం వచ్చేలా ఫన్నీ అండ్ రొమాంటిక్ కామెంట్ పెట్టింది సన్నీ లియోన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు