రూమర్: సితార ఎంట్రీకి మహేష్‌ నో

రూమర్: సితార ఎంట్రీకి మహేష్‌ నో

మహేష్ బాబు పక్కా ఫ్యామిలీ పర్సన్ అనే విషయం.. టాలీవుడ్ జనాలతో పాటు అభిమానులతో పాటు తెలుగు ప్రజలు అందరికీ తెలుసు. కుటుంబం.. భార్యా పిల్లల కోసం సమయం వెచ్చించడంలో.. మహేష్ చాలా మంది యంగ్ హీరోలకు ఆదర్శం అనడంలో సందేహం లేదు. ఇప్పుడు అనేక మంది హీరోలు తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ.. అనుబంధాలను ఫోటోల రూపంలో అభిమానులకు చూపిస్తున్నా.. ఇందుకు ఆద్యుడు మాత్రం మహేషే.

అలాంటి మహేష్ బాబు.. తను ఎంతగానో ప్రేమించే ప్రియమైన కూతురుకి నో చెప్పడం అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అయితే.. అసలు విషయం ఏంటంటే.. సితారను ఆన్ స్క్రీన్ పైకి తీసుకురావడానికి మహేష్ బాబు నో చెప్పాడట. ఆమెను తెరపై చూపించాలనే ఆరాటం చాలామందిలోనే ఉన్నా.. రీసెంట్ గా ఓ హిందీ ఛానల్ నుంచి మహేష్ అండ్ ఫ్యామిలీకి భారీ ఆఫర్ వచ్చిందట. ఓ సీరియల్ కోసం ముద్దులొలికే చిన్ని పాపను వెతుకుతున్న ఆ సీరియల్ క్యాస్టింగ్ టీంకి.. సితార అయితే పర్ఫెక్ట్ అనిపించిందట.

వెంటనే మహేష్ బాబును అప్రోచ్ కాగా.. ఆమెను బాలనటిగా తెరంగేట్రం చేయించడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పాడట. ఈ విషయంలో మహేష్ వైఫ్ నమ్రత కూడా.. ఫైనల్ డెసిషన్ ను తన భర్తకే వదిలేసిందని అంటున్నారు. ఇంకా ఆ సీరియల్ వాళ్లు అడుగుతూనే ఉన్నారు కానీ.. మహేష్ కొంచెం కూడా మనసు మార్చుకునే ఉద్దేశ్యంలో లేడని టాక్. మహేష్ కుమారుడు గౌతమ్ ఇప్పటికే 1నేనొక్కడినే సినిమాలో.. బుల్లి మహేష్ గా నటించాడని గుర్తుందిగా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు