భారతీయుడు-2 పని తెలుగు గడ్డపై మొదలు

 భారతీయుడు-2 పని తెలుగు గడ్డపై మొదలు

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘2.0’ సినిమాను తీర్చిదిద్దుతున్న ఏస్ డైరెక్టర్ శంకర్.. దీని తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా ‘భారతీయుడు-2’ చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 26న తైవాన్‌లో ‘ఇండియన్-2’ గాలి బుడగ ఎగరేసి మరీ ఈ ప్రాజెక్టును ధ్రువీకరించాడు శంకర్. నిజానికి అంతా అనుకున్న ప్రకారం జరిగితే ఈ పాటికే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లాల్సింది.

కానీ ‘2.0’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో ఆ సినిమా షూటింగ్ కూడా లేటవుతోంది. ఐతే ‘2.0’ పనిని పర్యవేక్షిస్తూనే ‘భారతీయుడు-2’ ప్రి ప్రొడక్షన్ పనుల్ని కూడా మొదలుపెట్టేశాడట శంకర్. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఈ చిత్రానికి సంబంధించి వర్క్ నడుస్తుండటం విశేషం.

‘భారతీయుడు-2’ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలోనే మొదలు కానుందట. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్స్ తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. సినిమాలో కీలక సన్నివేశాల్ని ఇక్కడే చిత్రీకరిస్తారట. ఈ ప్రాజెక్టుకున్న క్రేజ్ దృష్ట్యా బయట షూటింగులు చేయడం కష్టం. ఎలాంటి సెటప్ కావాలన్నా సమకూర్చే రామోజీ ఫిలిం సిటీలో శంకర్ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడట.

ఇంకో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘భారతీయుడు’ అప్పట్లో ఎంత పెద్ద సంచలనమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దీని సీక్వెల్ గురించి చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోంది. ఐతే కమల్ సరిగ్గా రాజకీయారంగేట్రానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ సినిమా కార్యరూపం దాల్చడం విశేషం. కమల్‌కు ఇదే చివరి సినిమా అయ్యే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు