బాలయ్య జోరు భలేగుందిలే

బాలయ్య జోరు భలేగుందిలే

సీనియర్ హీరో బాలకృష్ణను చూసి.. చాలామంది చాలా నేర్చుకోవాల్సిందే. ముఖ్యంగా సినిమాలు చేయడం విషయంలో ఆయనకు సాటి పోటీ లేదని చెప్పాలి. తోటి హీరోలు అందరూ ఏడాదికి ఒకటి చేయడానికే నానా తంటాలు పడుతుంటే.. ఈయన మాత్రం చకచకా మూవీస్ చేసేస్తున్నారు. ఇప్పుడు కూడా బాలయ్య చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయంటే.. యంగ్ హీరోలతో సమానంగా ఎంత కష్టపడతారో అర్ధమవుతుంది.

ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించేందుకు బాలకృష్ణ సై అన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. తనకు సింహా.. లెజెండ్ లాంటి భారీ సక్సెస్ లను ఇచ్చిన బోయపాటి శ్రీనుతో ఓ మూవీ చేసేందుకు బాలకృష్ణ అంగీకరించారు. ఈ చిత్రాన్ని జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించనున్నారు. ఆరోజున ముహూర్తం షాట్ తీసినా.. ఆగస్ట్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం రాంచరణ్ తో మూవీ చేస్తున్న బోయపాటి.. అది పూర్తి కాగానే బాలయ్యతో స్టార్ట్ చేస్తాడు.

ఈ లోగా మరో సినిమా పూర్తి చేయాలని నందమూరి బాలకృష్ణ భావిస్తున్నారు. పూరీ జగన్నాధ్ తో కానీ.. ఎస్వీ కృష్ణారెడ్డితో కానీ ఓ చిత్రాన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉందట. మరోవైపు.. తనతో జైసింహా తీసిన నిర్మాత సి కళ్యాణ్ కు మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట బాలయ్య. త్వరలోనే ఈ చిత్రంపై కూడా క్లారిటీ రానుందట. అంటే.. ఐదు ప్రాజెక్టులు బాలకృష్ణ చేతిలో దాదాపు సిద్ధంగా ఉన్నాయన్న మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు