ఎక్కడ చూసినా ఆ సుందరి దర్శనమే

ఎక్కడ చూసినా ఆ సుందరి దర్శనమే

టాలీవుడ్ లో ఆమె ఒక టాప్ మోస్ట్ బ్యూటీ. మెరిసే అందంతో పాటు ఎలాంటి సన్నివేశం అయినా మెప్పించే ట్యాలెంట్ ఆమె సొంతం. పైగా గ్లామర్ భామ. రేంజ్ ఉన్నా అందాల ప్రదర్శనకు అంతగా అభ్యంతరాలు పెట్టదు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్.. పెళ్లి తర్వాత స్లో అవుతుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు.

తాజాగా ఈ బ్యూటీ ఓ ప్రొడక్ట్ లాంఛింగ్ ఈవెంట్ కు అటెండ్ అయింది. అక్కడ కూడా నాభి సౌందర్యాన్ని తెగ ప్రదర్శించింది. నిజానికి ఈమె స్థాయికి ఇది చాలా చిన్న ఈవెంట్. పైగా పెద్ద ఫ్యామిలీ కోడలు కావడంతో.. పెళ్లి తర్వాత ఇలాంటివి తగ్గుతాయని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. చిన్నా చితకా హీరోయిన్స్.. ఓ మోస్తరు స్థాయి ఉన్న భామలు.. సైడ్ ఇన్ కం కోసం ఇలా కష్టపడుతుంటారు. కానీ ఈ బ్యూటీ పెళ్ళయ్యాక ఇలాంటివి ఆపేస్తుంది అనుకుంటే..  అక్కడికి కూడా గ్లామర్ సోకులు ఆరబోస్తూ వచ్చేసి.. అన్నిటికీ నేను రెడీ అనేస్తోంది.

యూత్ లోను.. ఫ్యామిలీ ఆడియన్స్ లోను విపరీతమైన క్రేజ్ ఉన్న బ్యూటీనే ఇంతగా గ్లామర్ కు ఓకే చెప్పేస్తుండడం.. చిన్నా చితకా ఈవెంట్స్ లో కూడా కనిపిస్తుండడంతో.. పాపం ఇతర హీరోయిన్లకు రిబ్బన్ కటింగ్ ఛాన్సులు తగ్గుతున్నాయి. ఇలాంటివి మానేసి ఏదో సొంత ప్రొడక్షన్.. కొత్త వ్యాపారం.. కొంగొత్త బాధ్యతలలో ఈమె బిజీ అవుతుందని అనుకున్నారు జనాలు. కాని అమ్మడు ఇసుమంతైనా తాను మారలేదని.. ఎంచక్కా చెబుతోంది. అన్నట్లు.. సోషల్ మీడియాలో కూడా ఈమె రచ్చ మామూలుగా ఉండదండోయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు