ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ ఢీ?

ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ ఢీ?

ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర తలపడకుండా సాగడం అన్నది ఇప్పుడు కష్టం అయిపోయింది. ప్రతి ఫ్యామిలీలోనూ హీరోలు పెరిగిపోతున్న నేపథ్యంలో క్లాష్ రాకుండా సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి కుదరట్లేదు. కొన్నిసార్లు పోటీ అనివార్యమవుతోంది.

ఎంతో మంచి సంబంధాలున్న మెగా ఫ్యామిలీ హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ సైతం ఫిబ్రవరి రెండో వారంలో బాక్సాఫీస్ దగ్గర తలపడ్డారు. వీరి కంటే ముందు రెండేళ్ల కిందట సంక్రాంతికి నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ పోటీ పడ్డారు. మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ వీళ్ల మధ్య పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి బాలయ్య-ఎన్టీఆర్ పోరు చూసే అవకాశముంది. సంక్రాంతిని చాలా సెంటిమెంటుగా భావించే బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కబోయే బయోపిక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది. వచ్చే సంక్రాంతికి ముందుగా బెర్తు బుక్ చేసుకున్న సినిమా ఇదే. మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే చిత్రాన్ని దసరాకు అనుకున్నారు. కానీ ఈ చిత్రం అనుకున్న దాని కంటే కొంచెం ఆలస్యంగా మొదలవుతోంది. దీంతో దసరా రిలీజ్ కష్టమే అంటున్నారు. దసరా మిస్సయితే ఇక టార్గెట్ సంక్రాంతే.

బాలయ్యతో ఇది వరకే పోటీ పడి పైచేయి సాధించిన తారక్.. ఈసారి కూడా పోటీ అనివార్యమైతే తగ్గే పరిస్థితి ఉండదు. కాకపోతే తనకు ఆరాధ్యుడిగా చెప్పుకునే తాత జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమాతో తలపడాల్సి రావడమే ఎన్టీఆర్‌కు ఇబ్బంది కలిగించే విషయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు