చూసుకున్నోడికి చూసుకున్న‌న్ని..!

చూసుకున్నోడికి చూసుకున్న‌న్ని..!

క‌ట్ట క‌ట్టుకొని మ‌రీ దాడి చేయ‌టమంటే ఇదేనేమో?  సినిమాల‌కు పండ‌గ‌రోజైన శుక్ర‌వారం రిలీజ్ కావ‌టం ఆన‌వాయితీ. పెద్ద పెద్ద సినిమాలైతే శుక్ర‌వారానికి ఒక రోజు ముందు.. చాలా త‌క్కువ సంద‌ర్భాల్లోనే బుధ‌వారమే తీసుకొచ్చేయ‌టం స్టార్ట్ అయ్యింది. శుక్ర‌వారం అయ్యిందంటే.. ఆ వారానికి ప‌రుగు పందెం మొద‌లైన‌ట్లే.

ఈ మ‌ధ్య‌న సినిమా థియేట‌ర్ల బంద్ కార‌ణంగా సినిమాల విడుద‌ల త‌గ్గ‌టం.. ప‌రీక్ష‌ల సీజ‌న్ కావ‌టంతో ఎవ‌రికి వారు త‌మ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు వెన‌క‌డుగు వేసిన ప‌రిస్థితి. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు పూర్తి కావటం.. చాలావ‌ర‌కూ స్కూళ్ల‌ల్లో ఎగ్జామ్స్ క్లియ‌ర్ కావ‌టం జ‌రిగిపోయింది. దీనికి తోడు ఆదివారం ఉగాది ప‌ర్వ‌దినం కావ‌టం లాంటి క‌లిసి వ‌చ్చే అంశాలు ఉండ‌టం ఈ శుక్ర‌వారం స్పెష‌ల్‌.

ఈ కార‌ణంతో పాటు.. రానున్న రెండు వారాల్లో పెద్ద సినిమాలు ఒక‌టి త‌ర్వాత ఒక‌టి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉండ‌టంతో.. ఈ రోజు పెద్ద ఎత్తున సినిమాలు థియేట‌ర్ల‌లో పోటెత్తనున్నాయి. అన్ని ఒక మోస్త‌రు సినిమాలే కావ‌టం.. కొన్ని సినిమాలైతే థియేట‌ర్లు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి. ఇటీవ‌ల కాలంలో ఇన్ని సినిమాలు ఒక్క‌సారిగా రావ‌టం జ‌రిగింది లేదు. ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల మీద‌కు దండ‌యాత్ర‌కు వ‌స్తున్న సినిమాల సంఖ్య‌ను చూసిన‌ప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు చూడాలంటే.. ఈ వారం క‌వ‌ర్ చేయ‌టం కాస్త క‌ష్ట‌మైన విష‌య‌మే.
ఈ రోజు విడుద‌ల కానున్న సినిమాల లిస్ట్ చూస్తే..

1. కిరాక్ పార్టీ
2. దండుపాళ్యం 3
3. క‌ర్త‌వ్యం
4. వాడేనా
5. నెల్లూరు పెద్దారెడ్డి
6. ఐతే
7. నా రూటే స‌ప‌రేటు
8. మ‌న‌సైనోడు (17 రిలీజ్‌)
హిందీ
9. రైడ్‌

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English