వరుణ్ పక్కన ఆమె పెద్దదైపోదూ..

వరుణ్ పక్కన ఆమె పెద్దదైపోదూ..

మెగా ఫ్యామిలీ యువ కథానాయకుడు వరుణ్ తేజ్ ఇప్పుడు మాంచి ఊపుమీదున్నాడు. గత ఏడాది ‘ఫిదా’తో కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్.. తాజాగా ‘తొలి ప్రేమ’తో మరో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఊపులో అతను ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు.

ఇది తెలుగులో రాబోయే తొలి పూర్తి స్థాయి స్పేస్ ఫిల్మ్ కాబోతుండటం విశేషం. ఈ చిత్రానికి కథానాయిక ఖరారైనట్లు సమాచారం. మణిరత్నం ‘చెలియా’తో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన అదితిరావు హైదరి వరుణ్ కు జోడీగా నటించనుందట.

‘చెలియా’ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న ‘సమ్మోహనం’తో నేరుగా తెలుగులోకి అడుగుపెడుతోంది అదితి. హైదరాబాదీనే అయిన ఈ అమ్మాయిని వరుణ్ సినిమాకు దర్శకుడు సంకల్ప్ ఓకే చేశాడట. ఐతే అదితి వరుణ్ పక్కన పెద్దదైపోతుందేమో అన్న సందేహాలు లేకపోలేదు. మనిషి భారీగా ఉంటాడు కానీ.. వరుణ్ వయసు తక్కువే. అతడికింకా 28 ఏళ్లే.

అదితి వయసేమో 31 ఏళ్లు. ఆమెకు ఆల్రెడీ పెళ్లయి డైవర్స్ కూడా అయింది. హీరోల కంటే హీరోయిన్లు కొంచెం వయసు ఎక్కువగా ఉండే సందర్భాలు గతంలో లేకపోలేదు కానీ.. హీరోయిన్ హీరో కంటే తక్కువ వయసున్నట్లు.. లేదా సమాన వయస్కురాలిగా కనిపించాలి. కానీ అదితి వరుణ్ ముందు కొంచెం పెద్దగానే కనిపించే అవకాశం ఉంది. మరి వరుణ్-అదితి జోడీ ఎలా ఉంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు