రంగస్థలం ఆరో పాట ప్రత్యేకత ఏంటంటే..

రంగస్థలం ఆరో పాట ప్రత్యేకత ఏంటంటే..

‘రంగస్థలం’ ఫుల్ ఆడియో వచ్చేసింది. ఇప్పటికే విన్న మూడు పాటలూ ఆకట్టుకోగా.. మిగతా రెండు పాటలు కూడా ఓకే అనిపించాయి. అవి మంచి డ్యాన్స్ నంబర్లలాగా అనిపిస్తున్నాయి. ఐతే ఆడియో వరకు చూస్తే ఇందులో ఉన్నవి ఐదు పాటలే కానీ.. వాస్తవానికి ఇందులో ఇంకో పాట కూడా ఉందట. అది సినిమాలో చూడండని.. అది పెద్ద సర్ప్రైజ్ అని అని స్వయంగా దర్శకుడు సుకుమారే వెల్లడించాడు.

ఇంతకీ ఆ సర్ప్రజ్ ఏంటి అంటే.. ఆ పాటను గీత రచయిత చంద్రబోస్ పాడటం. ‘రంగస్థలం’లోని అన్ని పాటలనూ చంద్రబోసే రాసిన సంగతి తెలిసిందే. చాన్నాళ్ల తర్వాత ఆయన సింగిల్ కార్డ్ రాశారు ఈ సినిమా కోసం.

చివరిదైన ఆరో పాటను కూడా చంద్రబోసే రాసి.. దాన్ని ఆయనే పాడి వినిపించారట. మీరే బాగా పాడుతున్నారు.. కానిచ్చేయండి అంటూ దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ ప్రోత్సహించడంతో చంద్రబోస్ పని కానిచ్చేశారట. మామూలుగానే చంద్రబోస్‌కు పాటలు పాడటం సరదా. చాలాసార్లు చాలా వేదికలపై ఆయన పాటలందుకున్నారు. ఐతే ఇన్నాళ్లకు ఆయన సినిమాలో పాట పాడేశారు. మరి ఆయన గానం సినిమాలో ఎలా ఉంటుందో.. ఆ పాట ప్రత్యేకత ఏంటో చూడాలి. ఒకప్పుడు తెలుగులో నంబర్ వన్ లిరిసిస్టుగా ఉన్న చంద్రబోస్.. ఆ తర్వాత జోరు తగ్గించేశాడు.

ఎప్పుడో ఒక పాట మాత్రమే రాస్తూ వచ్చారు. ఇలాంటి తరుణంలో ‘రంగస్థలం’ లాంటి క్రేజీ ప్రాజెక్టుకు అన్ని పాటలూ రాసే అవకాశం రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఈ సినిమా నేపథ్యానికి తగ్గట్లు బోస్ మాత్రమే సరైన పాట రాయగలడని సుక్కు భావించి ఆయనకు అవకాశమిచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English