మామూలు జనాలకి అర్థమవుద్దా?

మామూలు జనాలకి అర్థమవుద్దా?

డైరెక్టర్‌ దేవా కట్టా తీసినవి రెండే సినిమాలు అయినా కానీ ఇంటెల్లిజెంట్‌ ఫిలింమేకర్‌ అని, క్లాస్‌ డైరెక్టర్‌ అని అతనిపై ముద్ర పడింది. అతని డైలాగ్స్‌లో ఫిలాసఫీ తాండవిస్తుంది. దీని వల్ల సగటు సినీ ప్రేక్షకులకి దేవా కట్టా సినిమాలు అంతగా ఎక్కవు. ప్రస్థానం అంతమంచి సమీక్షలు తెచ్చుకుని, గత దశాబ్ధ కాలంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఒకటని అనిపించుకుంది. కానీ ఆ చిత్రం మాస్‌ ఆడియన్స్‌ని, సగటు సినీ అభిమానుల్ని ఆకట్టుకోలేకపోయింది. దేవా కట్టా తాజా చిత్రం 'ఆటోనగర్‌ సూర్య'లో కూడా ఈ ధోరణి కనిపిస్తోంది. ఇది అవడానికి మాస్‌ కథాంశమే అయినా కానీ దేవా కట్టా తన ఫిలాసఫీతో దీనిని నింపేశాడని అనిపిస్తోంది.

ఈ చిత్రం ట్రెయిలర్‌లో వినిపించిన 'మోటర్‌ క్యాస్ట్‌' డైలాగ్‌ అయితే చాలా మందికి అర్థం కాలేదు. ఆ డైలాగ్‌ ఏమిటనేది దేవా కట్టా వివరించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సంభాషణలు ఉంటే కనుక 'ఆటోనగర్‌ సూర్య' సినిమాకి దర్శకుడి వాయిస్‌ ఓవర్‌తో వివరణలు కూడా జత చేయాల్సి వస్తుంది. కంటెంట్‌ ఎక్సయిటింగ్‌గా అనిపిస్తున్నా కానీ ఎగ్జిక్యూషన్‌ ఈ చిత్రాన్ని ఒక వర్గం ప్రేక్షకులకే పరిమితం చేస్తుందా ఏమిటనే అనుమనాలు ఆల్రెడీ మొదలయ్యాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు