రాధిక మాటల్ని నమ్మొచ్చా?

రాధిక మాటల్ని నమ్మొచ్చా?

సౌత్‌లో సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ కొంచెం పేరు సంపాదించగానే.. ఇక్కడి సినిమాలు, జనాల మీద ఇష్టానుసారం కామెంట్లు చేయడం హీరోయిన్లకు అలవాటే. తాప్సి పన్ను, ఇలియానా, రాధికా ఆప్టే ఈ కోవకే చెందుతారు. రాధికా ఆప్టే ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా సౌత్ సినిమా గురించి ఏదో ఒక నెగెటివ్ కామెంట్ చేయకుండా ఉండదు. తాజాగా ఆమె తాను దక్షిణాదిన చేసిన ఒక సినిమా షూటింగ్ తొలి రోజు ఒక స్టార్ హీరో కాలితో గోకాడని.. తాను చెంప చెల్లుమనిపించానని అంది. దీంతో రాధిక చెంప దెబ్బ తిన్న హీరో ఎవరంటూ జనాలు చర్చలు మొదలుపెట్టేశారు.

రాధిక దక్షిణాదిన చేసిన సినిమాలు.. ‘రక్తచరిత్ర’, ‘ధోని’, ‘లెజెండ్’, ‘లయన్’, ‘కబాలి’. స్టార్ హీరో అని చెప్పింది కాబట్టి ‘రక్త చరిత్ర’.. ‘ధోని’ సినిమాల్ని మినహాయించొచ్చు. రజినీ వయసు రీత్యా ఆయన్ని కూడా జనాలు పరిహరించేస్తున్నారు. చివరగా బాలయ్య మీదికి వేళ్లు పోతున్నాయి. కొందరు యాంటీ ఫ్యాన్స్ ఏమో ఆ హీరో బాలయ్యే అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు. అయితే బాలయ్య లాంటి వాడు అంత చీప్‌గా ప్రవర్తించి ఉంటాడా అంటే సందేహమే. ఇక బాలయ్య స్థాయి కథానాయకుడిని రాధిక చెంపదెబ్బ కొట్టేంత సీన్ ఉందా.. అలా జరిగితే బాలయ్య ఊరుకునే తరహానా అన్నది కూడా ఆలోచించాలి. ఇదంతా చూస్తుంటే రాధిక పబ్లిసిటీ కోసం అబద్ధాలాడిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆమె మాటలు నమ్మశక్యంగా అనిపించట్లేదు. కాబట్టి ఈ మాటల్ని లైట్ తీసుకుని ఈ టాపిక్‌కు ఇంతటితో తెరదించేస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు