రాజమౌళి 'ఈగ' స్టోరీ రిపీట్‌!

రాజమౌళి 'ఈగ' స్టోరీ రిపీట్‌!

'ఈగ' చిత్రాన్ని తలపెట్టినపుడు పది కోట్ల లోపు బడ్జెట్‌తో సింపుల్‌గా తీద్దామని రాజమౌళి ప్లాన్‌ చేసాడు. హీరో లేని సినిమా కావడంతో ఎక్కువ ఖర్చు పెట్టకూడదని భావించారు. కానీ సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్‌ నాలుగింతలు అయింది. అప్పటికి పెద్ద స్టార్లతో చేస్తోన్న సినిమాలకి అవుతోన్న ఖర్చుతో సమానమది. అయితే రాజమౌళి బ్రాండ్‌ వల్ల, ఈగ సినిమా అద్భుతంగా వుండడం వల్ల బడ్జెట్‌ లిమిట్‌ దాటడం ఆ చిత్రాన్ని ఇబ్బంది పెట్టలేదనుకోండి. ఏదైనా సింపుల్‌గా చేద్దామని తలపెట్టడం, దానిని ఊహాతీతమైన స్థాయికి తీసుకుపోవడం రాజమౌళికి అలవాటే. ప్రస్తుతం అతను తలపెట్టిన మల్టీస్టారర్‌కి కూడా ఇది రిపీట్‌ అవుతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని నూట ఇరవై కోట్ల వ్యయంతో వంద రోజుల్లో పూర్తి చేయాలని భావించారు.

కానీ బడ్జెట్‌ ఎస్టిమేట్‌ రెండు వందల కోట్లు అవడమే కాకుండా, నిర్మాణానికి ఏడాదికి పైగా పడుతుందని హీరోలకి స్పష్టమైన సమాచారం అందింది. ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ వచ్చే ఏడాది పూర్తిగా రాజమౌళి సినిమాకే కేటాయించేసారు. ఇతర భాషల్లో రిలీజ్‌ వద్దని అనుకున్న రాజమౌళి ఇప్పుడు పరభాషా మార్కెట్‌కి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ని షేప్‌ చేస్తున్నాడు. అంతే కాకుండా గ్రాఫిక్స్‌ జోలికి పోకూడదని అనుకున్న తన నిర్ణయాన్ని మార్చుకుని ఈ చిత్రంలో వాటికి కూడా చోటు కల్పిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు