మంచి లక్షణాలు ఇవేనా ఎమ్మెల్యే!?

మంచి లక్షణాలు ఇవేనా ఎమ్మెల్యే!?

కళ్యాణ్ రామ్ ఇప్పుడు చకచకా సినిమాలు చేస్తున్నాడు. నా నువ్వే అనే సినిమాను దాదాపు పూర్తి చేసేశాడు. మరోవైపు ఎమ్మెల్యే మూవీ షూటింగ్ ను కూడా ఫైనల్ స్టేజ్ కి తెచ్చి.. రిలీజ్ కి రెడీ చేసేశాడు. కేవీ గుహన్ డైరెక్షన్ లో కొత్త సినిమా ప్రకటన కూడా త్వరలో వస్తుందని అంటున్నారు. ఇక మొదటగా వచ్చే ఎమ్మెల్యేకి అర్ధం.. మంచి లక్షణాలున్న అబ్బాయి అంటూ మొదటే చెప్పారు మేకర్స్.

మరి ఓ అబ్బాయికి మంచి లక్షణాలు అంటే.. ఏదైనా కొత్తగా ఎక్స్ పెక్ట్ చేయడం.. జనాల తప్పు కాదు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నారు. హేయ్ ఇందూ అంటూ లిరికల్ సాంగ్ కూడా వచ్చింది. ఇందులోంచి కొన్ని పోస్టర్లు కూడా విడుదల చేశారు. వీటిని చూస్తే.. హీరోయిన్ వెంట హీరో పడడం.. ఆమెను వేధించడం.. ఇబ్బందిపెట్టడం(ప్రేమ కోసమే) లాంటివే కనిపిస్తాయి. ఆడాళ్ళని హరాస్ చేయొద్దు. అలా వెంటబడొద్దు అని ఎందరో చెబుతూ ఉంటారు. అఫ్ కోర్స్.. ఇలాంటి పాటల్లో నటించే స్టార్లు కూడా స్టేజ్ దొరికితే చాలు ఉపన్యాసాలు దంచుతారు.

కానీ మన హీరోలు మాత్రం అలా చేయద్దని చూపించడం లేదు సరి కదా.. స్టాకింగ్ చేయడంలో కొత్త కొత్త కాన్సెప్టులను పరిచయం చేస్తున్నారు. దర్శకులు కూడా ఇలాంటి వాటిపై చూపించిన క్రియేటివిటీ మూవీ మేకింగ్ లో చూపించడం లేదు. ఓ 10 కమర్షియల్ మూవీస్ చూస్తే.. ఎనిమిదింటిలో ఇలాంటి సాంగ్స్ కనిపిస్తాయి. స్టాకింగ్ వీళ్ళు మానకపోతే.. ఆ సినిమాలు చూసి జనాలు ఏం మారతారో అర్ధం కాని విషయం. పైగా చివర్లో ఓ నిమిషం స్పీచ్ ఇచ్చి.. మేం మంచే చూపించామంటూ కవరింగ్ కబుర్లు భలే చెబుతుంటారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు