ఎన్టీఆర్ అంటే భయమేస్తోంది -పూజా హెగ్డే

ఎన్టీఆర్ అంటే భయమేస్తోంది -పూజా హెగ్డే

ఓ హీరోయిన్ ఒక స్టార్ హీరోకి భయపడుతున్నట్లు చెప్పడం అంటే.. రకరకాల మీనింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే కాస్త సాఫ్ట్ గా ఏమైనా ఆలోచించేవాళ్లేమో కానీ.. ఈ మధ్య మీడియా నుంచి యూట్యూబ్ వరకూ అన్నీ హార్డ్ హిట్టింగ్ రూమర్లే వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. ఎన్టీఆర్ ను గురించి తలచుకుంటేనే భయం వేస్తోందని హాట్ బ్యూటీ పూజా హెగ్డే చెప్పడం సంచలనం అవుతోంది.

కానీ పూజా హెగ్డే మాత్రం ఎన్టీఆర్ గురించి పాజిటివ్ యాంగిల్ లోనే ఈ విషయాన్ని చెప్పింది. డ్యాన్సుల విషయంలో తనకు ప్రావీణ్యం ఉండడంతో.. సినిమాల్లో ఎలాంటి క్లిష్టమైన స్టెప్పులను అయినా ఛాలెంజింగ్ గా తీసుకుంటానని చెప్పింది పూజా హెగ్డే. ఇప్పటికే అల్లు అర్జున్ తో డ్యాన్స్ చేసి మెప్పించగా.. ఇప్పుడు మరో సూపర్ డ్యాన్సర్ అయిన యంగ్ టైగర్ పక్కన చిందులు వేయడానికి ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పింది. కానీ ఆయన పక్కన యాక్టింగ్ చేయడం అన్న దగ్గరే భయం వేస్తోందట. జూనియర్ గురించి ఈమెకు చెప్పిన వాళ్లంతా.. ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పారట(అది నిజం కూడా.)

అంటే దాదాపుగా ప్రతీ సీన్ ని ఒకే షాట్ లో ఓకే చేయాల్సి ఉంటుంది. అదే తనను భయపెడుతోందని అంటోంది పూజా హెగ్డే. కాకపోతే ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో ప్రీప్రిపేర్ అయిపోతానని అంటోంది. పవన్ కళ్యాణ్ కు.. త్రివిక్రమ్ కు తన తండ్రి వీరాభిమాని అంటున్న ఆమె.. అత్తారింటికి దారేది చిత్రాన్ని బోలెడన్ని సార్లు చూశానని అంటోంది. ఇప్పుడు త్రివిక్రమ్ తో మూవీ చేసే ఛాన్స్ తనకు రావడంపై.. నాన్న ఫుల్ హ్యాపీ అంటోంది పూజా హెగ్డే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు