సాహో ఆపేసి కొత్తదా? వామ్మో బాహుబలి

సాహో ఆపేసి కొత్తదా? వామ్మో బాహుబలి

ఒక ప్రాజెక్టు కోసం నాలుగేళ్లు టైం కేటాయించడం.. మళ్లీ పోస్ట్ ప్రొడక్షన్.. పబ్లిసిటీ.. రిలీజ్.. సెలబ్రేషన్స్ కోసం దాదాపు ఇంకో ఏడాది.. ఏతావాతా ఒక్క క్యారెక్టర్ కోసం రమారమి ఐదేళ్ల సమయం కేటాయించే సాహసం చేసిన ఏకైక ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్. బాహుబలి తొలి భాగం విషయంలో ఎప్పుడెప్పుడా అని అభిమానులు తెగ ఎదురుచూశారు.

రెండో పార్ట్ కు వచ్చేసరికి కరణ్ జోహార్ ఒత్తిడి పుణ్యమా అని ముందే డేట్ చెప్పడం.. అనుకున్న తేదీకి సినిమాను థియేటర్లలోకి తేవడం జరిగాయి. చివరకు ఇండియన్ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ కి అభిమానులు తెగ సంతోషించారు.. పండగ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత సినిమా సంగతేంటి అనే విషయమే తేలడం లేదు. సాహో అంటూ సుజిత్ డైరెక్షన్ లో సినిమా మొదలెట్టి ఏడాదికి గడిచిపోతోంది. ఇది వచ్చే ఏడాది సమ్మర్ కు కానీ థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ లేదనే టాక్ ఉంది. ఇది ఇప్పటికి వినిపించే టైం మాత్రమే.. రియాలిటీలో మరెంత సాగుతుందో తెలీదు.

సాహో పూర్తయ్యే లెక్క తేలకపోవడంతో రాధాకృష్ణ దర్శకత్వంలో మరో మూవీ మొదలుపెట్టేందుకు ప్రభాస్ ప్రిపేర్ అవుతున్నాడని అంటున్నారు. అటు సాహో.. ఇటు కొత్త సినిమా రెండిటినీ ఒకేమారు షూటింగ్ చేస్తాడట. జూలైలో మొదలయ్యే ఈ సినిమా షూటింగ్.. ఎప్పటికి కంప్లీట్ అవుతుందో.. అదెప్పటికి రిలీజ్ కు నోచుకుంటుందో తెలియాలి.

ఎలా చూసినా.. బాహుబలి2 తర్వాత మళ్లీ ప్రభాస్ కొత్త సినిమాకి రెండేళ్ల సమయం పట్టేస్తోంది. కొంత కాలం క్రితం బాహుబలి విడుదల కోసం ఎదురుచూసిన మాదరిగానే తయారైంది అభిమానుల పరిస్థితి. ఇప్పటివరకూ సాహో అంటూ సంబరాలు చేసుకున్న వారికి.. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు గురించి డీటైల్స్ సేకరించాల్సిన పని పడింది.

ఈ మొదలుపెట్టడం సంగతేమో కానీ.. ఏదో ఒక సినిమాకి అది పూర్తయ్యేదెప్పుడో చెబితే.. కనీసం ఉజ్జాయింపుగా ఫలానా నెలలో రిలీజ్ చేస్తామంటే.న్స్ ఆ డేట్ కోసం ఎదురుచూస్తారు.. లేకపోతే మళ్లీ బాహుబలి మాదిరిగా ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. కాస్త ఆలోచించు ప్ర'బాసూ'!


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు