ఎన్టీఆర్ టార్గెట్.. 17 కిలోలు

ఎన్టీఆర్ టార్గెట్.. 17 కిలోలు

జూనియర్ ఎన్టీఆర్ ఒకప్పుడు ఎంత లావుగా ఉండేవాడో తెలిసిందే. ఒక స్టార్ హీరో అంత లావు, బరువు ఉండటం అరుదైన విషయమే. కెరీర్లో ఏడెనిమిదేళ్లు అలాగే సాగిన తారక్.. చివరికి ‘యమదొంగ’ సినిమా దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా బక్కచిక్కి కనిపించి అందరికీ పెద్ద షాకిచ్చాడు. అప్పుడు ఎన్టీఆర్ సర్జరీతో బరువు తగ్గాడా.. లేక ఎక్సర్‌సైజులతో తగ్గాడా అన్నదానిపై స్పష్టత లేదు. సర్జరీతోనే తగ్గాడన్నది చాలామంది నమ్మకం. ఆ సంగతలా వదిలేస్తే అప్పుడు మరీ ఎక్కువ బరువు తగ్గిపోయి బక్కచిక్కి కనిపించిన తారక్.. తర్వాత కొంచెం ఒళ్లు చేసి పర్ఫెక్టు‌గా తయారయ్యాడు. కానీ ఈ మధ్య మళ్లీ కొంచెం అదుపు తప్పుతున్నట్లుగా కనిపించాడు. ‘జై లవకుశ’లో కొన్నిచోట్ల లుక్ తేడాగా అనిపించింది.

ఐతే త్రివిక్రమ్ సినిమా కోసం లుక్ పూర్తిగా మార్చేయాలని డిసైడైన తారక్..  గట్టిగానే కసరత్తులు మొదలుపెట్టాడు. ఆ మార్పు ఇటీవలే అందరూ చూశారు. అతడి ‘బీస్ట్ లుక్’ వైరల్ అయింది. ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఇప్పటిదాకా 12 కిలోల దాకా బరువు తగ్గాడట. ఐతే అతను అక్కడితో ఆపట్లేదట. ఇంకో ఐదు కిలోల దాకా బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట. మరీ భారీగా ఏమీ లేని ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమా కోసం ఏకంగా 17 కిలోలు తగ్గాలనుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి ‘యమదొంగ’.. ‘కంత్రి’ సినిమాల్లో మాదిరి ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరీ బక్క చిక్కి కనిపిస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English