లోకేష్ అవినీతి నీకెలా తెలుసు ప‌వ‌న్‌...క్ష‌మాప‌ణ‌లు చెప్పు

లోకేష్ అవినీతి నీకెలా తెలుసు ప‌వ‌న్‌...క్ష‌మాప‌ణ‌లు చెప్పు

త‌మ మిత్ర‌ప‌క్ష నేత‌, జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి మొద‌లుపెట్టింది. త‌మ పార్టీ నాయ‌కుడు చంద్ర‌బాబు, యువ నాయ‌కుడు లోకేష్ అవినీతి ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు విరుచుకుప‌డ్డారు. పార్టీ నేత‌లు ఒక‌రివెంట మ‌రొక‌రు ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ స‌మాచారం, ఆధారాలు లేకుండా రాజకీయాల్లో ఇటువంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎలా పడితే అలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి, లోకేష్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మజ్జిగన్నం తిన్న తర్వాత కూరన్నం తిన్న చందంగా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం భావ్యం కాదని ఎద్దేవా చేశారు. ఆవేశంగా మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజం కాదని అన్నారు.చంద్రబాబు, లోకేష్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. గబ్బర్ సింగ్ గురి తప్పాడని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్యేలు బోండా ఉమా, బడేటి బుజ్జి మాట్లాడుతూ రాజధానికి 2 వేల ఎకరాలు సరిపోతుందని సీఎం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. పవన్ చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాల‌ని డిమాండ్ చేశారు. కోట్ల సంపాదనను వదులుకొని లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారని, కుటుంబం కంటే రాష్ట్ర్ర ప్రయోజనాలే లోకేష్ కు ముఖ్యమ‌ని అన్నారు. `శేఖర్ రెడ్డి కేసులో లోకేష్ ఉన్నారని మీకెవరు చెప్పారు? హోదాపై మోడీని ఎందుకు ప్రశ్నించలేదు?` అంటూ ప్ర‌శ్నించారు. పవన్ వల్ల కాపులకు ఏ ఉపయోగం లేదని ఆరోపించారు. లోకేష్ అవినీతిపై ఆధారాలు చూపించాలి, రాజకీయ ఉనికి కోసమే టీడీపీపై ఆరోపణలు చేశార‌ని మండిప‌డ్డారు.

బీజేపీకి వైసీపీ ఎడమ చేయి, జనసేన కుడి చేయిగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోందని టీడీపీ ఎమ్మెల్యేలు మండిప‌డ్డారు. `ఎప్పుడైనా పవన్ రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లాడా ? కేంద్రమంత్రులతో మాట్లాడాడా ? ఏ కులాల మధ్య చిచ్చు పెడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం ? బీజేపీ స్క్రిప్టును జగన్ చదివి వినిపించినట్లు ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English