సౌత్ స్టార్ హీరో చెంప ప‌గ‌ల‌గొట్టా: రాధికా ఆప్టే

సౌత్ స్టార్ హీరో చెంప ప‌గ‌ల‌గొట్టా: రాధికా ఆప్టే

హీరోయిన్ రాధికా ఆప్టే ప‌లు తెలుగు, త‌మిళ‌, హిందీ చిత్రాల‌లో త‌న అందంతో పాటు అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. తెలుగులో లెజెండ్‌, లయన్‌, రక్తచరిత్ర న‌టించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న ప్యాడ్ మ్యాన్ లో న‌టించింది. గ‌తంలో క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాధిక....తాజాగా మ‌రోసారి ఇండ‌స్ట్రీలో లైంగిక వేధింపుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ద‌క్ష‌ణాదిలో తాను న‌టించిన తొలి సినిమాలోనే ఓ ప్రముఖ హీరో త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని తెలిపింది. దీంతో, చిర్రెత్తుకొచ్చి తాను ఆ హీరో చెంప ఛెళ్లుమ‌నిపించాన‌ని చెప్పింది.

తాజాగా నేహా ధూపియా యాంక‌రింగ్ చేసిన ఓ టీవీ షోలో రాధిక పాల్గొన్న సంద‌ర్భంగా ప‌లు షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను హీరోయిన్ గా కెరీర్ మొద‌లు పెట్టిన తొలినాళ్ల‌లో ఓ సౌత్ సూప‌ర్ స్టార్ త‌న‌తో అభ్యంత‌ర‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని చెప్పింది. షూటింగ్ స‌మ‌యంలో త‌న కాలుపై కాలు వేసి రుద్ద‌డంతో కోపం వ‌చ్చి చెంప‌దెబ్బ కొట్టాన‌ని తెలిపింది. అంత‌కు ముందు త‌న‌కు ఆ హీరో క‌నీసం పరిచయం కూడా లేడ‌ని తెలిపింది. మ‌రోవైపు, టాలీవుడ్ లో హీరోల ఆధిప‌త్యం ఎక్కువ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం సినిమాల‌నుంచి ఎవ‌రు రిటైర్ అయితే బాగుంటుంద‌ని మీరు భావిస్తున్నార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు....రామ్ గోపాల్ వ‌ర్మ అని ఠ‌క్కున స‌మాధానం చెప్పింది. అయితే, ఆయ‌న ఇప్ప‌టికే ఎన్నో విల‌క్ష‌ణ సినిమాలు తీశాడ‌ని, అందుకే ఆయ‌న పేరు చెప్పాన‌ని రాధికా వివ‌ర‌ణ ఇచ్చింది. తాజాగా, బీచ్ లో బికినీ వేసుకున్న రాధికాపై నెటిజ‌న్లు తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేయడంతో వారికి ఘాటుగా స‌మాధానమిచ్చిన సంగ‌తి తెలిసిందే. బీచ్ లో బికినీ కాకుండా చీర క‌ట్టుకొని తిర‌గ‌లేం క‌దా...అంటూ రాధికా రిటార్ట్ ఇచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు