ముచ్చటగా ఏడోసారి పనిచేస్తున్నారు

ముచ్చటగా ఏడోసారి పనిచేస్తున్నారు

అటు తెలుగులోనూ ఇటు తమిళంలోనూ తనదైన శైలిలో స్వరాలు చేకూరుస్తూ కెరీర్ లో అందరికంటే ఒక మెట్టు పైనే ఉన్నాడు హ్యారీస్ జయరాజ్. ఇప్పటికే కార్తి, రకుల్ నటిస్తున్న తమిళ సినిమాను టేక్ అప్ చేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ కార్తి అన్న సూర్య సినిమాకు కూడా సై అన్నాడు.

గ్యాంగ్ సినిమా హిట్ తో 2018 ని చాలా ఆనందంగా మొదలు పెట్టిన సూరియా ఎన్.జి.కె అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ కె.వి.ఆనంద్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు ఈ గజిని యాక్టర్. ఈ సినిమాకు మరెవరో కాదు హ్యారీస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఇది మొదటి సారి కాదు. ఇప్పటికే వీరిరువురు కలిసి ఆరు సినిమాలు చేశారు. ఇప్పుడు ఎడవసారి కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. అది కూడా ఐదేళ్ల తర్వాత.

ఆఖరిసారి హ్యారీస్ బ్రదర్స్ సినిమాకు సూర్యకు సంగీతం అందించాడు. ఆ సినిమాను కూడా కె.వి.ఆనందే డైరెక్ట్ చేయడం విశేషం. నిజానికి ఇప్పటికి 3 సూర్య సినిమాలకు కె.వి దర్శకత్వం వహించాడు. ఇది వారి నాలుగో సినిమా. హ్యారీస్-సూర్య కాంబోలో వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్టే. అందులో సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, 7త్ సెన్స్ సినిమాలు బాగా హిట్ అయ్యాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు