ఐతే 2.0.. కాన్సెప్ట్ కొత్తగానే ఉంది కానీ

 ఐతే 2.0.. కాన్సెప్ట్ కొత్తగానే ఉంది కానీ

‘రుషి’.. ‘ఆంధ్రాపోరి’ లాంటి సినిమాలతో దర్శకుడిగా తన అభిరుచిని చాటుకున్నాడు రాజ్ మాదిరాజు. ఆ సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినప్పటికీ.. విభిన్నమైన సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. ‘రుషి’ సినిమాతో ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు సైతం అందుకున్నాడు రాజ్. ప్రసాద్ ప్రొడక్షన్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆయనతో ఒకటికి రెండు సినిమాలు నిర్మించింది.

ఐతే ఆ సినిమాలు ఆడకపోవడంతో దర్శకుడిగా రాజ్‌కు చాలా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో నటుడిగా కొన్ని సినిమాలు చేసిన రాజ్.. మళ్లీ చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టి తీసిన సినిమా ‘ఐతే 2.0’. చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన ‘ఐతే’ స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా ఇది. ఈ నెల 16న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ చేశారు.

ఇందులో కూడా ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఒక బ్యాచ్.. డబ్బులు సంపాదించడం కోసం ఒక క్రైమ్ చేయడానికి రెడీ అవుతుంది. ఒక క్రిమినల్‌ను ట్రాప్ చేసి.. హ్యాకింగ్ చేయడం ద్వారా భారీ మొత్తంలో డబ్బు కొట్టేయాలని చూస్తుంది. కానీ వీళ్ల ప్లాన్ తిరగబడి వీళ్లే ట్రాప్‌లో చిక్కుకుంటారు. ట్రైలరేమో ఆసక్తికరంగానే ఉంది. కాన్సెప్ట్ కొత్తగా, ట్రెండీగా అనిపిస్తోంది.

కాకపోతే ఇది సినిమాలా కాకుండా షార్ట్ ఫిలిం తరహాలో కనిపిస్తోంది. క్వాలిటీ ఆ రేంజిలోనే ఉంది మరి. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌ పోటీలకు ఈ సినిమాను పంపారు. అక్కడ మంచి రెస్పాన్సే వచ్చింది. అందరూ కొత్తవాళ్లతో తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు