నారా రోహిత్.. తన బలాన్నే వదిలేశాడే

నారా రోహిత్.. తన బలాన్నే వదిలేశాడే

యువ కథానాయకుడు నారా రోహిత్‌ బలాలేంటి అని పరిశీలిస్తే ముందుగా ఎవ్వరైనా చెప్పేది అతడి వాయిస్ గురించే. అది అతడికి వరం అనే చెప్పాలి. స్పష్టమైన ఉచ్ఛారణతో చాలా బాగా డైలాగులు చెబుతాడు నారా రోహిత్. నటన విషయంలో పర్వాలేదనిపించే రోహిత్.. డైలాగ్ డెలివరీతో చాలా సినిమాల్లో తన పాత్రలకు ప్రత్యేకత తీసుకొచ్చాడు.

రోహిత్ సినిమా అనగానే దర్శకులు డైలాగుల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అతడి బలాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని చూస్తారు. ఇదీ అతడి వాయిస్‌కు ఉన్న ప్రత్యేకత. అలాంటిది ఒక సినిమా కోసం తన అతి పెద్ద బలాన్నే వదిలేయబోతున్నాడు రోహిత్.

ఈ రోజు నారా రోహిత్ కొత్త సినిమా ఒకటి ప్రకటించారు. ఉగాదికి మొదలయ్యే ఈ చిత్రాన్ని మంజునాథ్ అనే దర్శకుడు రూపొందించబోతున్నాడు. నారాయణరావు అట్లూరి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ చిత్రంలో నారా రోహిత్ మూగవాడి పాత్ర చేయబోతున్నట్లు వెల్లడైంది. మరి తన వాయిసే బలంగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన రోహిత్.. ఆ బలాన్ని వదిలేసి కేవలం నటనతో పాత్రను నెట్టుకురాగలడా అన్నది సందేహం.

అతడి నటన జస్ట్ ఓకే అనిపిస్తుంది కానీ.. ముఖంలో హావభావాలు పెద్దగా పలకవు. కేవలం సీరియస్‌నెస్ చూపించమంటే ఓకే కానీ.. మిగతా రసాలు అంతగా పలికించలేడు. కామెడీ చేయాలన్నా.. ఇంకే రసం పండించాలన్నా వాయిస్ మీద బాగా ఆధారపడతాడతను. ఈ నేపథ్యంలో మూగవాడిగా రోహిత్ మెప్పించడం అంత సులువు కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు