ఇలియానా సుడి అలా త‌గ‌ల‌బ‌డింది

ఇలియానా సుడి అలా త‌గ‌ల‌బ‌డింది

ఇలియాని ఒక‌ప్ప‌డు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌ను త‌న న‌డుము చుట్టు తిప్పుకున్న మెరుపు తీగ‌. ఇప్పుడు ఒక్క అవ‌కాశం ఎవ‌రైనా ఇస్తారేమో అని ఆశ‌గా ఎదురుచూస్తోంది. కెరీర్ మంచి పీక్ స్టేజీలో ఉన్న‌ప్పుడు టాలీవుడ్‌ను కాద‌ని బాలీవుడ్ కు చెక్కేసింది. పోనీ అక్క‌డేమ‌న్నా బాగుప‌డిందా అంటే అదీలేదు. అన్నింటినీ వ‌దులుకుని ప్లాఫ్ హీరోయిన్‌గా మిగిలింది.

ఇలియానా హీరోయిన్‌గా తెలుగులో సూప‌ర్ హిట్ అయిన సినిమాలు పోకిరి మ‌రియు కిక్‌. ఆ రెండూ క‌మ‌ర్షియ‌ల్ సూప‌ర్ హిట్ కొట్టి బాలీవుడ్లో కూడా రీమేక్ అయ్యాయి. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ వాటి రీమేక్లో న‌టించేందుకు అంగీక‌రించాడు. హీరోయిన్‌గా ఎవ‌రిని పెట్టాల‌న్న చర్చ వ‌చ్చిన‌ప్పుడు... తెలుగులో ఎంతో బాగా న‌టించిన ఇలియానాకే అవ‌కాశం ఇచ్చాడ‌ట స‌ల్మాన్‌. కానీ అమ్మ‌డు వాటిని స‌రిగా వాడుకోలేదు. స‌రికదా ఆ సినిమాల‌ను వ‌దులుకుంది. దీంతో చాలా మంచి అవకాశాల‌ను చేజార్చుకుంది. పోకిరి సినిమాను బాలీవుడ్‌లో వాంటెడ్ పేరుతో తెర‌కెక్కించారు. భారీ హిట్ అందుకుంది. అలాగే కిక్ సినిమాను అదే పేరుతో రీమేక్ చేశారు. ఇది కూడా కాసుల వ‌ర్షం కురిపించింది.

వాంటెడ్ సినిమాలో ఆయేషా ట‌కియాను... కిక్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను హీరోయిన్లుగా ఎంపిక‌చేసుకున్నారు. ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌కి మంచి పేరు వ‌చ్చింది. జాక్వెలిన్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో స్థిర‌ప‌డింది. ఇలియానా త‌న సినిమాల‌ను వ‌దిలేసుకుని కొత్త సినిమాల కోసం ఎదురు చూసింది. అంతే అంగ‌డిలో అన్నీ ఉన్నా... అల్లుడినోట్ల శ‌ని ఉండ‌డం అంటే ఇదే. హిట్ సినిమాలు కోరి వ‌స్తే వ‌దిలేసుకుని... ఇప్పుడు ఎవ‌రైనా అవ‌కాశం ఇస్తారేమో అని వెత‌క‌డం చూస్తే ఆమె సుడి ఎలా త‌గ‌ల‌బ‌డిందో అర్థ‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English