ఆండ్రియా ఎంత స్ట్రాంగ్ గా చెప్పిందంటే..

ఆండ్రియా ఎంత స్ట్రాంగ్ గా చెప్పిందంటే..

మనసులో ఉన్న విషయాన్ని బైటకు చెప్పడం చాలాసార్లు కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లు ఏది పడితే అది మాట్లాడలేరు. ఇక పురుషాధిక్యత స్పష్టంగా కనిపించే ఫిలిం ఫీల్డ్ లో హీరోయిన్స్ కు తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే అవకాశం అరుదుగా వస్తుంది.

వచ్చినా ధైర్యంగా చెప్పేవాళ్లు తక్కువే. కానీ తాను మాత్రం ఎలాంటి మాట అయినా చెప్పేయగలను అంటోంది హీరోయిన్ ఆండ్రియా జెరామియా. రీసెంట్ గా ఈమె తారామణి అనే చిత్రంలో కనిపించింది. ఆ మూవీలో ఈ భామ యాక్టింగ్ కు బోలెడంత పేరు వచ్చింది.. ప్రశంసలు కూడా దక్కాయి. అయితే.. తారామణి తర్వాత తనకు కొత్తగా అవకాశాలు రాకపోవడాన్ని ఈమె నిలదీస్తోంది. 'అదే విజయ్ సినిమాలో మూడు పాటల్లో డ్యాన్సులు వేస్తే.. నాలుగైదు ఆఫర్స్ వచ్చి పడతాయి. కానీ నా యాక్టింగ్ నచ్చినా అవకాశం మాత్రం రాదు' అంటూ ఉమెన్స్ డే సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో నిలదీసింది ఆండ్రియా జెరామియా. ఇప్పుడు కాస్త లేటుగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే ఆన్ స్క్రీన్ పై కనిపించాలని అనుకోవడం లేదని.. సెక్సీ రోల్స్ చేసినా.. తాను యాక్టింగ్ కూడా చేయగలనని అంటోంది ఆండ్రియా. నడుం ఊపడం.. సగం సగం బట్టలు వేసుకోవడం నాకేమైనా ఇష్టమా అంటూ మండిపడింది ఆండ్రియా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English