హీరోతో సెల్ఫీ కావాలంటే క్యూలో రావాలి

హీరోతో సెల్ఫీ కావాలంటే క్యూలో రావాలి

అల్లావుద్దీన్ ఖిల్జీ ఎలా ఉంటాడో మనం ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు కానీ.. సంజయ్ లీలా భన్సాలీ ఆ పాత్రను మలిచిన తీరుకు అనుగుణంగా.. మనకు ఆన్ స్క్రీన్ పై క్రూరమైన ఖిల్జీని చూపించాడు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్. విభిన్న పాత్రలతో ఆడియన్స్ కు చేరువైన ఈ హీరో.. ఎంతో కష్టపడి ఎదిగాడు.

ప్రస్తుతం జోయా అక్తర్ రూపొందిస్తున్న గల్లీ బోయ్ మూవీలో నటిస్తున్నాడు రణవీర్ సింగ్. ఆలియా భట్ తో ఈ కుర్ర హీరో రొమాన్స్ చూసేందుకు ఆడియన్స్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబై బాంద్రా సమీపంలో ఉన్న ధారావి ఏరియాలో జరుగుతోంది. స్టార్ హీరో షూటింగ్ కు రావడంతో జనాలు కూడా ఆసక్తి చూపించారు.. సెల్ఫీలు దిగేందుకు తెగ ట్రై చేశారు. ఆ సమయంలో రణవీర్ సింగ్ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

స్పాట్ కు వచ్చిన అందరితోనూ ఫోటోలు దిగేందుకు  సరే అన్నాడు కానీ.. తనతో ఫోటో దిగాలంటే క్యూలో నుంచోవడం తప్పనిసరి అన్నాడు రణవీర్. చెప్పినట్లుగానే వయసుతో తేడా లేకుండా అందరినీ క్యూ లైన్ లో నుంచోపెట్టాడు. ఓ సెల్ఫీ దిగడం.. వెంటనే అతనిని మెల్లగా తోయడం.. నెక్ట్స్ సెల్ఫీకి మరో పోజ్ ఇవ్వడం.. ఈ సీన్ భలే ఫన్నీగా మారిపోయింది. జనాలు కూడా స్కూల్ పిల్లల మాదిరిగా వరుసలో భలే నుంచున్నారులే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు