మిష్టర్ పర్ఫెక్ట్ మొద‌టి పోస్టు ఇదే

మిష్టర్ పర్ఫెక్ట్ మొద‌టి పోస్టు ఇదే

అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించిన న‌టుడు.. మిష్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌. ఆయ‌న సినిమాలు చైనాలో కూడా కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయ్‌. అమీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా త‌క్కువేమీ కాదు. అలాంటి వ్య‌క్తికి ఇంత‌వ‌ర‌కు ఇన్‌స్టాగ్రామ్ లేదు. ఇదిగో ఈ రోజే ఎంట్రీ ఇచ్చాడు. తొలుత ఆయ‌న పెట్టిన పోస్టు అంద‌రి మ‌న‌సులు దోచేసింది.

మోస్ట్ స్టైలిష్ మ్యాన్‌గా త‌నను తాను మార్చుకోగ‌ల‌డు... అలాగే దంగ‌ల్ లో పొట్ట పెంచిన తండ్రిలా సాధార‌ణంగానూ క‌నిపించ‌గ‌ల‌డు అమీర్ ఖాన్‌. అందుకే అత‌నంటే ఎంతో మందికి ఇష్టం. ఈ సూప‌ర్ స్టార్ త‌న అభిమానుల కోసం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచాడు. అత‌ను వివ‌రాలు నింపిన కొన్ని గంట‌ల్లోనే ఖాతా వెరిఫికేష‌న్ అయిపోవ‌డం.... ఓపెన్ అయిపోవ‌డం కూడా జ‌రిగిపోయింది. అత‌ను పెట్టిన మొద‌టి పోస్టు త‌న త‌ల్లి జీన‌త్ హుస్సేన్ గురించి. అంద‌మైన ఆమె ఫోటోని పెట్టి  త‌నిప్పుడు ఇలా ఉండ‌డానికి కార‌ణ‌మైన వ్య‌క్తి అని క్యాప్ష‌న్ పెట్టాడు. ఆ ఫోటోలో అమీర్ ఖాన్ త‌ల్లి స‌హ‌జ సౌంద‌ర్య‌వ‌తిలా క‌నిపిస్తున్నారు. ఇలా అమీర్ ఖాన్ ఖాతా తెరిచాడో లేదో కొన్ని గంట‌ల్లోనే రెండు ల‌క్ష‌ల న‌ల‌భై రెండు వేల‌ మంది ఫాలోవ‌ర్స్ గా చేరారు. రోజులే గ‌డిచేకొద్దీ ఆ సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంది.

అమీర్ ఖాన్ తండ్రి ప్రొడ్యూస‌ర్ తాహిర్ హుస్సేన్. తండ్రి వార‌స‌త్వాన్నే పుచ్చుకుని సినిమాల‌లో స్థిర‌ప‌డిపోయాడు అమీర్‌. 1965లో పుట్టాడు. ఇత‌నికి ఇద్ద‌రు సోద‌రీమ‌ణులు, ఒక సోద‌రుడు ఉన్నాడు. అమీర్ మొద‌ట రీనా ద‌త్తాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా ఇద్ద‌రు పిల్ల‌ల‌కు తండ్ర‌య్యాడు. త‌రువాత ఆమెకు విడాకులిచ్చి కిర‌ణ్ రావ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్ద‌రికీ స‌రోగ‌సీ ప‌ద్ద‌తిలో ఒక కొడుకు పుట్టాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు