నాగ్ భలే ఫొటో షేర్ చేశాడులే..

నాగ్ భలే ఫొటో షేర్ చేశాడులే..

అక్కినేని నాగార్జున ఈ ఉదయం ట్విట్టర్లో షేర్ చేసిన ఫొటో జనాల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. కొన్ని గంటల్లోనే అది వైరల్ అయిపోయింది. నాగ్ తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కారు నడుపుతుంటే ఆయన పక్కనే సీటు మీద స్టైలుగా ఎన్టీఆర్ కూర్చున్న ఫొటో అది. ఆ ఫొటో కొన్ని దశాబ్దాల కిందటిది. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ తరలివచ్చిన తొలి రోజుల నాటి ఫొటో అది. ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన.. అత్యాధునికమైన.. భారీగా ట్రాఫిక్ ఉండే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో తీసిన ఫొటో అది. అప్పుడక్కడ జనాల్లేరు. బిల్డింగుల్లేవు. భారీ నిర్మాణాల్లేవు. వాహనాలు లేవు.

ఒకవైపు అప్పుడే నిర్మాణం మొదలుపెట్టుకున్న అన్నపూర్ణ స్టూడియోస్.. మరోవైపు కేబీఆర్ పార్కు ప్రహరీ గోడ.. మొత్తంగా చూస్తే నగర శివార్లలో జన సంచారం పెద్దగా లేని ప్రాంతంలా కనిపిస్తోంది ఆ రోడ్డు. ఇదంతా చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. అప్పటి పరిస్థితుల్ని కళ్లారా చూసిన వాళ్లకు ఇది నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చేదే. ఎన్నో సినిమాల్లో కలిసి నటించినప్పటికీ ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య అప్పట్లో గట్టి పోటీ ఉండేది. అభిమానుల్లో గొడవలుండేవి. అయినప్పటికీ వాళ్లిద్దరూ వ్యక్తిగతంగా తమ స్నేహ బంధాన్ని కొనసాగించారు. ఆ క్రమంలోనే ఇలా కార్లో బయట ఉల్లాసంగా తిరుగుతూ కెమెరాకు చిక్కినట్లున్నారు. ఈ ఫొటో చూసిన ఎవరికైనా మనసు పులకిస్తుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English