చరణ్‌ కూడా ఒకటిచ్చేశాడండీ

చరణ్‌ కూడా ఒకటిచ్చేశాడండీ

మెగా హీరోల్లో ఒకరి సరసన నటిస్తే వెంటనే వారికి మిగతా ఇద్దరితో నటించడానికి అవకాశాలు తరుముకుంటూ వచ్చేస్తున్నాయి. కాజల్‌తో చరణ్‌ మగధీర చేయగానే అల్లు అర్జున్‌తో ఆర్య 2కి ఆఫర్‌ వచ్చింది. అలాగే తమన్నాతో బన్నీ బద్రీనాథ్‌ చేయగానే చరణ్‌ రచ్చ, పవన్‌ కెమెరామెన్‌ గంగతో రాంబాబు చిత్రాలిచ్చి ఎంకరేజ్‌ చేశారు.

అలాగే శృతిహాసన్‌ ముందుగా పవన్‌తో మొదలు పెట్టి తర్వాత చరణ్‌, అల్లు అర్జున్‌తో మెగా సర్కిల్‌ పూర్తి చేసింది. చరణ్‌ సరసన నాయక్‌లో నటించిన అమలా పాల్‌ ఇప్పుడు అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో నటిస్తోంది. అలాగే ఇద్దరమ్మాయిలతోలో బన్నీ సరసన నటిస్తున్న క్యాధరీన్‌ త్వరలో చరణ్‌తో జంట కట్టనుంది.

కొరటాల శివ దర్శకత్వంలో చరణ్‌ హీరోగా రూపొందే సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ క్యాథరీన్‌ అట. ఇక ఈ ఇద్దరమ్మాయిలకి పవన్‌ కళ్యాణ్‌ సరసన ఆఫర్‌ రావడమే ఆలస్యమన్నమాట. ఎలాగో సమంత కూడా ఈ మెగా సర్కిల్‌ పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది. ఇంకా కాజల్‌కి మాత్రమే పవర్‌స్టార్‌ ప్రాజెక్ట్‌ పెండింగ్‌లో ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు